ప్రపంచాన్ని వణికించిన మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్‌లో ఇటలీ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని అసభ్యకరంగా మార్ఫ్ చేసిన ఫోటోలు ప్రదర్శించబడటంతో తీవ్ర కలకలం రేగింది. సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ ఈ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం మెలోని గారే కాకుండా, పలువురు ప్రముఖ మహిళా రాజకీయనేతలు, సినీ ప్రముఖులు, మోడల్స్, సాధారణ మహిళల ఫోటోలు కూడా ఈ సైట్‌లో వికృతంగా పోస్ట్ చేయబడటంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


సుమారు 7 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కలిగిన ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు ఈ సంఘటన బయటపడిన వెంటనే సైట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అయినప్పటికీ, ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల గౌరవాన్ని దిగజార్చే విధంగా మార్ఫ్ చేసిన ఫోటోలు ప్రచారం చేయడం నేరమని, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై స్వయంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి నేరగాళ్లను కఠినంగా శిక్షించాలి. ఈ ఘటన కేవలం నాపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదు, మహిళలపై జరుగుతున్న వేధింపులకు ఒక ప్రతీక. బాధితులందరికీ నా పూర్తి సంఘీభావం ఉంది,” అని ఆమె తెలిపారు. అలాగే, ఈ రకమైన పోర్న్ వెబ్‌సైట్లు సమాజాన్ని వికృత దారుల్లో నెడుతున్నాయని, వాటిని కట్టడి చేయడం అత్యవసరం అని హెచ్చరించారు.



ఈ వెబ్‌సైట్ 2005 నుండి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంది. కానీ ఇంతకాలం దానిపై ఎటువంటి పెద్ద చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సైట్‌లో ప్రధానంగా భర్తలు లేదా ప్రియులు తమ భార్యల లేదా లవర్స్ ఫోటోలను పోస్ట్ చేసి, వాటిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సైకోలా ప్రవర్తిస్తారని బాధిత మహిళలు తెలిపారు. ఒక మహిళా బాధితురాలు మాట్లాడుతూ, “ఈ సైట్‌లో కేవలం భర్తలకు మాత్రమే లాగిన్ యాక్సెస్ ఇస్తారు. తర్వాత వారు తమ భార్యల లేదా ప్రేయసుల ఫోటోలను మార్ఫ్ చేసి, ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ పిచ్చిపిక్స్, అసహ్యకరమైన కామెంట్లతో ఆనందిస్తారు. ఇది పూర్తిగా నేరం” అని ఫైర్ అయ్యారు.



ఈ ఘటన వెలుగులోకి రావడంతో, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. “ప్రధానమంత్రి ఫోటోలు సైతం ఈ స్థాయిలో మార్ఫ్ చేసి పోర్న్ సైట్లలో పెడితే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఈ నెట్‌వర్క్‌లను కూల్చివేయాలి” అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఈ ఘటనపై కఠిన ఆదేశాలు జారీ చేశారు. అసభ్యకర ఫోటోలు సోషల్ మీడియాలో మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాలని, నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని ఆమె హుకుం జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీపై కొత్త ఆందోళనలను తెచ్చాయి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఈ రకమైన సైట్లపై అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: