ప్రతి మహిళ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని చాలా కలలు కంటూ ఉంటుంది. అమ్మ అనే పిలువు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లల కోసం ఆసుపత్రుల చుటూ తిరుగుతున్నారు. ఇక మెడిసిన్ వాడుతూ గర్భధారణ చాలా పాట్లు పడుతుంటారు. అయితే మీరు ముందుగా పండంటి బిడ్డను కావాలని కోరుకుంటే గర్భం దాల్చక ముందు నుంచే పోషాకాహారం తీసుకోవాలని వైద్యుల చెబుతున్నారు. గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం వలన గర్భధారణను నిర్దేశిస్తుందని అంటున్నారు.

అయితే గర్భం దాల్చిన తర్వాత కూడా పోషకాహారం అవసరం అని చెపుతున్నారు. ఇక గర్భంలో ఉన్న పిండం ఆరోగ్యకరమైన శిశువుగా రూపాంతరం చెందేందుకు, చక్కని ఎదుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. అయితే అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి అవకాశమివ్వకుండా కడుపు పండిన ప్రతీ మహిళ తప్పనిసరిగా చక్కని ఆహారంపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.అయితే కొన్నిసార్లు గర్భిణులకు వారు తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వక ఇబ్బంది అపడుతుంటారు. ఇక అలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు కొన్నిచిట్కాలను చెబుతన్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఇక గర్భిణుల్లో కొందరికి అరగకపోవడం, కడుపులో మంట సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాక శరీరంలో జరిగే హార్మోన్లు, శారీరకపరమైన మార్పుల వల్ల ఇలా అనిపించొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా ఉంటే కారం, మసాలాలు, చాక్లెట్లు, సిట్రస్ పండ్లైన కమలా, నిమ్మతోపాటు కాఫీలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అయితే ఆహారాన్ని కొంచెం కొంచెం ప్రతీ మూడు గంటలకు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక అది కూడా హడావిడిగా మింగేయకుండా మంచిగా నమిలి తినాలని సూచిస్తున్నారు.

అంతేకాక.. తాజాపండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని అన్నారు. ఇక అందులో విటమిన్ ఈ, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి ఫీటస్ గ్రోత్ కు ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక రాత్రి పూట సెనగలు, పెసలు, బొబ్బర్లు వంటివి నానబెట్టుకుని పొద్దున్నే తింటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: