ఒక స్టార్ సెలబ్రిటీ లైఫ్ అన్నది ఎంత లక్సరి గా ఉంటుందో, అంతే బాధ్యతగా కూడా ఉంటుంది. తమ క్రేజ్, ను క్రెడిట్ ను కొనసాగించేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు నటీనటులు. అయితే కొందరు హీరోయిన్లు అప్పటి వరకు ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని పెళ్ళాడి మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఫ్యామిలీ, ఇండస్ట్రీ అంటూ చాలా చాలా బిజీగా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే కనీసం నిద్ర పోయే తీరిక కూడా లేదని అయిన ఫ్రెష్ గా డే స్టాట్ చేయడానికి ఎపుడు ప్రయత్నిస్తాను అంటూ క్యాప్షన్ ఇచ్చి ఒక బ్యూటిఫుల్ ఫోటో ను షేర్ చేశారు నటి అనుష్క. ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం కంటే మేకింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.. అటు కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించడం లోనూ శబాష్ అనిపించుకుంటున్న అనుష్క తనకి నిద్రపోవడానికి కేవలం రెండు గంటలే దొరికాయి అంటోంది.  ఇటీవలే ఓటీటీలో కూడా అడుగు పెట్టిన ఈ అందాల తార ఇక్కడ కూడా ది బెస్ట్ అనిపించుకోవాలని చాలా కష్టపడుతున్నారు. తన ఓ టి టి వేదికకు సంబందించిన విషయం అయి పలువురు ప్రేమికులను కలుస్తూ కొత్త కొత్త రూపకల్పనలు చేస్తున్నారు. అలాగే 'ఏ మదర్ ఏజ్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చక్ దా ఎక్స్ ప్రెస్' లోనూ హీరోయిన్ గా చేస్తోంది. మరో వైపు 'ఖాలా' అనే మరో వెబ్ సిరీస్ బాధ్యతలు ఇంకోవైపు కుటుంబం ఇలా చాలా చాలా బిజీ షెడ్యూల్ తనది.

కాగా ఒక ఫోటో ని షేర్ చేస్తూ కేవలం రెండు గంటలే నిద్రపోయాను అంటూ ఆ ఫోటోని ఉద్దేశించి రాసుకొచ్చింది. అయితే ఆ ఫోటోలో అనుష్క చాలా రెస్ట్ లెస్ గా కనిపిస్తున్నప్పటికీ తన ఆత్మ విశ్వాసం మాత్రం మెండుగా కనపడుతోంది. పనిపై తనకున్న డెడికేషన్ ని కనబరుస్తోంది. అయితే ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు మీరు చాలా గ్రేట్  మ్యామ్ అంటూ పొగిడేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ది గ్రేట్ ఉమెన్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: