పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంట్లో శుభకార్యాలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బిగ్ షాకింగ్ న్యూస్. ఆషాడమాసం తర్వాత శ్రావణమాసం వస్తుంది . ఆ శ్రావణమాసంలోనే ఏవైనా శుభకార్లు చేసుకోవాలి.  ఆ తర్వాత కార్తీకమాసంలో మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి . అది తప్పిస్తే 2026 ఫిబ్రవరి వరకు మంచి ముహూర్తాలే లేవు . ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మంచిది కాదు అంటున్నారు పండితులు.  ఓవైపు గురు మూడం ఆ తర్వాత ఆషాడమాసం ఆ తర్వాత నెల రోజులు  పాటు మాత్రమే మంచి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండడం .. ఆ తర్వాత అసలు మంచి ముహూర్తాలు లేకపోవడం ఇప్పుడు శుభకార్యలు చేసుకోవాలనుకునే వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి పని చేయాలి అన్నా సరే ముహూర్తం చూస్తారు.  గురు బలం శుక్ర గ్రహం చాలా ప్రధానంగా భావిస్తారు . శక్తిని కోల్పోయినప్పుడు శుభకార్యాలు నిర్వహిస్తే గురు బలం ఉండదు అని పండితులు చెప్పుకొస్తున్నారు . గురు బలం లేనప్పుడు ఏ శుభకారం చేసిన అది శుభాని ఇవ్వదు అంటూ కూడా పండితులు చెబుతున్నారు . ఆ కారణంగానే మూడంలో ఏ శుభకార్యాలు చేయకూడదు అనేది పెద్దలు చెప్పిన మాట. జూలై 12 ఆషాడమాస బహుళ విదియ శనివారంతో గురుమూడం ముగుస్తుంది.

ఆ తర్వాత జూలై 26న శ్రావణమాసం స్టార్ట్ అవుతుంది . ఆగస్టు 24వ తేదీ శ్రావణమాసం ఎండ్ అవుతుంది . ఈ శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి.  పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకోవచ్చు . ఈ మాసం తప్పితే నవంబర్ నెల వరకు ఇక మంచి ముహూర్తాలే లేవు.  అంటే శుభకార్యాలు చేసుకోకూడదు . నవంబర్ అక్టోబర్ లో కూడా ఐదు పది కి మించి మంచి ముహూర్తాలు లేవు . ఇక ఆ సమయంలో శుభకార్యాలు మిస్ అయితే మాత్రం మూడు నెలలు బ్రేక్ పడినట్లే . ఫిబ్రవరి 2026 వరకు ఆగాల్సిందే . అప్పటివరకు శుక్ర మూఢం ఉంటుంది.  ఆ కారణంగానే శుభకార్యలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు త్వరగా చేసేసుకోవాలి అంటూ పండితులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!


*శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మౌఢ్యమి రోజుల్లో వివాహం చేయకూడదు.

*లగ్న పత్రిక కూడా రాసుకోకూడదు, అసలు పెళ్లికి సంబంధించిన మాటలు కూడా కూడదు అంటున్నారు పండితులు

*గృహప్రవేశం, శంకుస్థాపన లాంటివి చేయకూడదు..ఇల్లు కూడా మారరాదు
 
* చిన్నారులకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు వాళ్లకి సంబంధించి ఏ పనులు చేయకూడట
 
* మౌఢ్యమి సమయంలో అన్న ప్రాసన చేసుకోవచ్చు

*గృహంలో రిపేర్ వర్కులు చేయించుకోవచ్చు
 
* భూములు కొనుగోలు చేయొచ్చు, అమ్మొచ్చు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చు
 
* కొత్త ఉద్యోగాల్లో చేరొచ్చు, ఉద్యోగం మారొచ్చు, ఉద్యోగం కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేయొచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: