ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో రకమైన కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు మారుతి మార్కెట్ లోకి మరో కొత్త కారును విడుదల చేసింది. మారుతి సుజుకి 800 చాలా కాలంగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. ఇప్పుడు కంపెనీ మారుతి ఆల్టో 800 ను కొత్త అవతార్‌లో విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం  మారుతి భారతదేశంలో రెండు ఎంట్రీ లెవల్ కార్లను విడుదల చేయడానికి చూస్తోంది..



కేవలం మారుతి నే కాకుండా కొన్ని కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లు ఉన్న కార్లను విడుదల చేస్తున్నారు.కొత్త ఎస్‌యూవీ, ఎమ్‌పివి కార్లను విడుదల చేయనున్నాయి. ఇకపోతే ఈ ఏడాది అన్నీ పెద్ద కార్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి మాత్రం సుజికి, ఆల్టో 800 కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం భారతదేశం లో అత్యంత విజయవంతమైన కార్లలో ఒకటి. ఈ కార్ కంపెనీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భారత్‌లో లాంచ్ కానుంది. అయితే, కొత్త స్విఫ్ట్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు



ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే..1.2 ఎల్, 4 సిలిండర్ కె 12 ఎన్ డ్యూయల్జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్‌ను కంపెనీ తన డిజైర్ కాంపాక్ట్ సెడాన్‌లో కూడా ఉపయోగిస్తుంది. సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ స్టైలింగ్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేస్తుంది. ఇవే కాకుండా మరీ కొన్ని మార్పులు ,చేర్పులు చేసి సరి కొత్తగా మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. మొదటి నుంచి మారుతి కార్లకు ఇండియాలోనే మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. త్వరలోనే కొత్త హంగులతో కార్ల ప్రేమికులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ కార్లు మార్కెట్ ఏ రేంజులో క్రేజ్ ను సంపాదించుకుంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: