ఏపీలో క‌రోనా ఉధృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే గ‌న్న‌వ‌రం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ ఆవరణలోకి కేవ‌లం ప్ర‌యాణికులు, వారితో పాటు వ‌చ్చిన ఒక డ్రైవ‌ర్‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ఎయిర్ పోర్ట్ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేయనున్నారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా...ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రయాణికులకు కూడా కొవిడ్ పరీక్షలు చేయనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: