మన నిత్య జీవితంలో కేంద్రం, రాష్ట్రం అందించే సంక్షేమ పథకాలను పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ఆధార్ కార్డ్ భారీ మొత్తంలో జరిపే లావాదేవీల కొరకు, ఆదాయపు పన్ను శాఖ రిటర్నులు దాఖలు చేయటం కొరకు మరియు ఐడెంటిటీ ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆధార్ కార్డ్ యొక్క పరిధిని పెంచే విధంగా ఆధార్ కార్డును పాన్ కార్డు స్థానంలో ఉపయోగించవచ్చని తెలిపింది. 
 
గతంలో పాన్ కార్డును పొందాలంటే చాలా నియమ నిబంధనలు ఉండేవి. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తరువాత పాన్ కార్డ్ పొందాలంటే 10 నుండి 25 రోజుల సమయం వేచి చూడాల్సి వచ్చేది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను మార్చింది. ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగా పాన్ కార్డును పొందే సౌకర్యాన్ని కల్పించింది. కేవలం పది నిమిషాల్లో పాన్ పొందే విధంగా ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను మార్చింది. 
 
పాన్ కార్డును పొందాలనుకునేవారు ఆధార్ కార్డ్ సహాయంతో సులభంగా పాన్ కార్డ్ పొందవచ్చు. నూతన విధానం ద్వారా పాన్ కార్డును పొందాలనుకునేవారు ఇన్‌స్టంట్ ఇ పాన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆధార్ నంబర్ ను ఎంటర్ చేస్తే ఆధార్ కు ఇచ్చిన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా పాన్ కార్డును పొందవచ్చు. ఆ తరువాత పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉన్న పాన్ కార్డ్ వస్తుంది. ల్యామినేటెడ్ పాన్ కార్డును పొందాలనుకునేవారు 50 రూపాయలు చెల్లించి ల్యామినేటెడ్ పాన్ కార్డును పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: