దానిమ్మ.. రుచే కాదు.. ఆరోగ్యాన్ని.. అందాన్ని కూడా ఇస్తుంది. దానిమ్మతో చర్మానికి.. జుట్టుకు అదనపు సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ దానిమ్మ వల్ల ఆరోగ్యం ఎంతో ఉంటుంది. అయితే.. ఈ దానిమ్మ పండులో విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల చర్మానికి మృదుత్వం వస్తుంది. దానిమ్మతో అందం ఏలాగానో ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

దానిమ్మ గింజలు తింటే యాక్నే, నల్లమచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.

 

దానిమ్మ తొక్కును మెత్తటి పొడిలా చేసి అందులో స్పూను నిమ్మరసం, స్పూను తేనె వేసి పేస్టులా చేసి ముఖానికి, మెడకు రాసుకుని గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కుంటే నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. 

 

రెండు స్పూన్ల దానిమ్మ గింజలు తీసుకుని అందులో ఒక స్పూను పసుపువేసి, బాగా కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని యాక్నే ఉన్న ప్రదేశంలో రాసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి. 

 

దానిమ్మ గింజలతో తయారు చేసిన నూనె వల్ల ఎగ్జిమా, సొరియాసిస్‌ తగ్గిపోతాయి.

 

ఈ పండులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యం చేస్తాయి.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: