మానసిక ఒత్తిడి, వాతావరణంలో కాలుష్యం, ఆందోళన వంటివి కూడా జుట్టురాలే సమస్యకు కారణమవుతున్నాయి. అయితే ఇందుకోసం ఎన్ని రకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడినప్పటికీ ప్రయోజనం కలగడం లేదు. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని చిట్కాలను మీ ముందుకు తీసుకువచ్చాము. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఒక గిన్నెలో కొన్ని వేపాకులను వేసి, అందులో కొద్దిగా నీరు పోసి స్టౌ మీద పెట్టి బాగా మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించాక ఆ నీటిని చల్లార్చి, ఆ నీటిని వడగట్టి జుట్టుకు బాగా పట్టించాలి. తర్వాత కొంతసేపటికి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
పచ్చి ఉసిరికాయలను తీసుకొని,వాటి గుజ్జును సేకరించి మెత్తటి పేస్ట్ లా తయారు చేయాలి. ఆ పేస్ట్ ను ఒక బట్ట లో వేసుకొని బాగా పిండి తే రసం వస్తుంది. ఆ రసం లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి విముక్తి పొందవచ్చు..
ఒక ఉల్లిపాయ తీసుకొని,దానిని మెత్తటి పేస్ట్ లా చేసి, దాని నుండి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్ళకు పట్టించి బాగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం ఆగడాన్ని అతి తక్కువ కాలంలోనే గమనించవచ్చు.
పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి, వాటిని మిక్సీ పట్టాలి. ఇక ఈ మిశ్రమం నుంచి కూడా కొబ్బరి పాలను తీసి, వాటిని జుట్టుకు బాగా పట్టించి, 20 నిమిషాలు ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జును కూడా తలకు బాగా పట్టించి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి