ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా వైద్యులు, నర్సులు, ఇత‌ర టెక్నీషియ‌న్స్‌, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు క‌రోనా వైర‌స్‌పో పోరాడుతున్నారు. వారి వారి కుటుంబాల‌కు దూరంగా ఉంటూ ప్రాణాల‌కు తెగించి వైద్యులు, న‌ర్సులు క‌రోనా బాధితుల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్నారు. వారి సేవ‌ల‌కు దేశ‌మంతా స‌లాం చేస్తోంది. వారి సేవ‌ల‌ను కొనియాడుతోంది. కొవిడ్ వారియ‌ర్స్ స‌లాం పేరిట‌ భార‌త త్రివిద ద‌ళాల ఆధ్వ‌ర్యంలో నేడు దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్ ఆస్ప‌త్రుల‌పై పూల వ‌ర్షం కురిపించారు. ఇండియ‌న్ ఎయిర్స్‌ఫోర్స్ హెలికాప్ట‌ర్ల ద్వారా వైద్య‌సిబ్బందిపై పూల‌వ‌ర్షం కురిపించింది. నేడు దేశ‌వ్యాప్తంగా ఈ అరుదైన క్ష‌ణాల‌ను భార‌త్ ప్ర‌జ‌లు క‌నులారా వీక్షించారు. వైద్య‌సిబ్బంది అందించిన అరుదైన గౌర‌వాన్ని చూసి ఆనంద‌భాష్పాలు రాల్చారు.

 

ఈ గౌర‌వం తెలుగు రాష్ట్రాల్లోని కొవిడ్ ఆస్ప‌త్రుల‌కు కూడా ద‌క్కింది. ఏపీలోని వైజాగ్‌లో ఉన్న గీతం ఆస్ప‌త్రిపై ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చాప‌ర్ పూల వ‌ర్షం కురిపించింది. ఈ వీడియో అంద‌రూ త‌మ ఫోన్ల‌లో బంధించుకున్నారు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక త‌మ‌కు ద‌క్కిన అపురూప గౌర‌వంపై వైద్యులు, న‌ర్సులు, పారిశుధ్య సిబ్బంది ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, త్రివిద ద‌ళాల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన సంఘీభావ సంకేత కార్య‌క్ర‌మం వైద్య‌సిబ్బందిలో మ‌రింత ఆత్మ‌స్థైర్యాన్ని నింపుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. వారు మరింత ధైర్యంగా సేవ‌లు కొన‌సాగిస్తార‌ని చెబుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: