ఆ మద్య సూర్య, మోహన్ లాల్ నటించిన ‘బందోబస్త్’ చిత్రం చూశారా.. ప్రత్యర్థులపై యుద్దం బాబాంబులు, మిసైల్స్ తో కాద మిడతలో నాశనం చేయొచ్చు అన్న కాన్సెప్ట్  అందరినీ ఆశ్చర్య పరిచినా.. ఇది నిజజీవితంలో జరుగుతున్నదనే అంటున్నారు.  ప్రత్యర్థి దేశాల పంటపొలాలను నాశనం చేయడానికి మిడతలు పంపితే అవి పూర్తిగా నాశనం చేస్తాయి.. దాంతో ఆహారో దాన్యాల కోసం పక్క దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది.. అలాగే దేశం ఆహారం కోసం అల్లకల్లోలం అవుతుంది. తాజాగా పాకిస్తాన్ నుంచి వచ్చిన పాడు మిడతలు మధ్యభారత దేశంలోని పంటలను కబళిస్తున్నాయి. వాటి బారి నుంచి పంటలు కాపాడుకోడానికి రైతులు నానా తిప్పలూ పడుతున్నారు. మందులు కొట్టినా మళ్లీ వస్తుండడంతో వాటిని వెళ్ల గొట్టేందుకు అన్ని మార్గాల్లో యత్నిస్తున్నారు.

 

అధికారుల సూచనల మేరకు మిడతలను తరిమికొట్టేందుకు రైతులు పలు ప్రయత్నాలు  కొనసాగిస్తున్నారు. మిడతల దాడి మొదలైన బుధ్నిలోని పొలాల్లో పెద్దగా శబ్దాలు చేస్తూ పొలాల వద్ద పలు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాక, అవి ఏ దిశగా వెళుతున్నాయన్న విషయాన్ని కూడా గుర్తించి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. అలాగే, మిడతల తాకిడి ఉన్న పొలాల పరిసరాల్లో రసాయనాలను పిచికారి చేస్తున్నారు. ఈ మిడతలను నియంత్రించలేకపోతే కోట్లాది రూపాయల విలువైన పెసర పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఒక చోట నుంచి వెళ్తున్న మిడదలు మరో చోట బీభత్సం సృష్టిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: