ఇప్పుడు దేశ వ్యాప్తంగా చిరుత పులుల సందడి ఎక్కువైంది. చిరుత పులులు మనుషులు బయటకు రాకపోవడంతో అవి జనాల్లోకి ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే చిరుత పులి ఒకటి మధ్యప్రదేశ్ లో చుక్కలు చూపించింది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిన్న అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకున్నారు. 

 

డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ టిఎస్ సులియా మీడియాతో మాట్లాడుతూ  "చిరుతపులికి సుమారు 3 నుండి 4 సంవత్సరాల వయస్సు ఉందన్నారు. దానిని ఐఐటి దగ్గర చాలాసార్లు గుర్తించారని పేర్కొన్నారు. ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగి దాన్ని పట్టుకున్నామని ఆయన మీడియాకు వివరించారు. ఇక తిరిగి దానిని అడవిలో వదిలేస్తామని పేర్కొన్నారు. అయితే అది పట్టుకున్న తర్వాత చాలా ఇబ్బంది పెట్టింది అని దాని వద్దకు వెళ్ళడానికి అధికారులు భయపడ్డారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: