ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ప్రభావం తీవ్రంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనాతో పాటుగా ఆక్సిజన్ కొరత కూడా రాష్ట్రాన్ని తీవ్రంగా వేదిస్తుంది. ఈ నేపథ్యంలో సి‌ఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లేఖలో ఆయన పలు విషయాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఏపీకి  కేటాయిస్తున్నా 590 టన్నుల ఆక్సిజన్ ఏమాత్రం సరిపోవడం లేదని రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని కోరారు. అలాగే 20 ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా కేటాయించాలని ప్రతిపాదించారు. ఇక చెన్నై, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి రావలసిన ఆక్సిజన్ సరఫరా ఆలస్యం వల్లే తిరుపతిలో మరణించారని, మళ్ళీ అలాంటి పరిస్థితులు జరగకుండా ఏపీకి సరిపడా లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని సి‌ఎం జగన్ లేకలో పేర్కొన్నారు ,  .

మరింత సమాచారం తెలుసుకోండి: