తెలంగాణా జెన్కో మరియు ట్రాన్స్ కో లకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధిక్కరణ నోటీసులు జారిచేసినట్లు తెలుస్తోంది. విధుల్లో చేరేందుకు అనుమతి ఇవ్వట్లేదని 84 మంది ఉద్యోగులు సుప్రిం కోర్టును ఆశ్ర‌యించ‌డంతో దీనిపై కోర్టు విచార‌ణ జ‌రిపింది.  1150 మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున పంపిణి చేయాల‌ని.. ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం 655 మందిని ఏపీ ప్రభుత్వం చేర్చుకుంది.

84 మందిని మినహాయించి మిగిలినవారిని తెలంగాణ ప్రభుత్వం చేర్చుకుంది. దాంతో మిగిలిన 84 మంది ఉద్యోగులు ధిక్కారణ పిటీషన్ తో సుప్రీం తలుపులు తట్టినట్టు తెలుస్తుంది. దీనితో ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కార్పోరేట్ కార్యాలయ అధికారి గోపాలారావుకు కుడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు తదుపరి విచారణ జూలై 16కి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: