
తొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే. షేర్ చేసిన ఫోటోలో, బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనపడిన నేపథ్యంలో లాక్ చేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటించింది. దీనిపై స్పందించిన బాలిక తల్లి, ట్వీట్ లేదా ఫోటోపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ రోహన్ గుప్తా కాంగ్రెస్ పార్టీ కీలక నేతల అకౌంట్ లతో పాటుగా ఐదువేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ట్విట్టర్ ఖాతాలను కూడా బ్లాక్ చేశారని ఆరోపించారు. ఇక బాలిక తల్లి ముందుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడంతో దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.