ఉమ్మ‌డి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నారా చంద్ర‌బాబునాయుడి నోటినుంచి ఒక ఊత‌పదం నిరంత‌రం వ‌స్తుండేది. అదేమిటంటే.. నేను నిద్ర‌పోను.. మిమ్మ‌ల్ని నిద్ర‌పోనివ్వ‌ను అనేవారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల గురించి ఆయ‌న చెప్పిన డైలాగ్ అది. ఆ డైలాగ్ దెబ్బ‌కి ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా హ‌డ‌లిపోయారు. ఐఏఎస్ స్థాయిలో, గ్రూప్‌-1 స్థాయిలో ఉన్న అధికారులు బాగా ప‌నిచేసిన‌ప్ప‌టికీ కిందిస్థాయి సిబ్బందికి ప‌నిచేయ‌మ‌నేసరికి కోపం వ‌చ్చింది. అంతే చంద్ర‌బాబునాయుడు ఓడిపోయారు. ఇప్పుడు తాజాగా ప్ర‌కాష్ రాజ్ కూడా మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన త‌ర్వాత ఒక చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ రెండు సంవ‌త్స‌రాలు విష్ణు ప్యానెల్‌ను నిద్ర‌పోనివ్వ‌ను అన్నారు. ప్ర‌తి నెలా రిపోర్టు కార్డ్ అడుగుతాను అన్నారు. చంద్ర‌బాబులాగానే ప్ర‌కాష్ రాజ్ కూడా మాట్లాడారే అని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక‌నుంచి మంచు విష్ణుకు, మోహ‌న్‌బాబుకు, వారి ప్యానెల్ స‌భ్యుల‌కు నిద్ర ఉండ‌దు. మీరు ఏమి అభివృద్ధి చేశారు అని వారిని నెల‌నెలా ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్నించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు కాబ‌ట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa