గుంటూరు కేంద్ర సహకార బ్యాంకులో భారీ కుంభకోణం జరిగిందా.. కోట్ల రూపాయలు దారి మళ్లాయా.. నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్ పుస్తకాలు సృష్టించి డిసిసిబిలో రుణాలు తీసుకున్నారా.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 28 సొసైటీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయా..  రైతుల పేరుతో కోట్లాది రూపాయల సొమ్ము దోచేశారా.. అంటే అవునంటున్నారు జిల్లా టీడీపీ నాయకులు. ఈ స్కామ్‌పై సమగ్ర విచారణ జరపించాలని టీడీపీ సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు.


నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్ పుస్తకాలు సృష్టించి డిసిసిబిలో రుణాలు పొందారని.. రైతుల పేరుతో కోట్లాది రూపాయల సొమ్ము దోచేశారని నరేంద్ర అంటున్నారు. కొందరు సొసైటీ అధ్యక్షులు కారుమూరి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఆదేశాలతో రుణాలిచ్చినట్లు చెప్పారని... అశోక్ రెడ్డికి బ్యాంకుకు సంబంధం ఏంటో తేల్చాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు. డీసీసీబీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: