ఇటీవల చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ చర్చలు జరిపిన మాట తెలిసిందే. ఆయన ఇంటికి వెళ్లి మరీ పవన్ చర్చలు జరిపారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై పవన్ నిన్నటి రణ స్థలం సభలో స్పందించారు. నేను చంద్రబాబును కలిస్తే పిచ్చికూతలు కూస్తున్నారన్న పవన్‌ కల్యాణ్‌.. బేరాలు కుదిరాయని విమర్శలు చేస్తున్నారన్నారు. ఏటా పాతిక కోట్లు పన్నులు కట్టే వ్యక్తిని.. నాకు ప్యాకేజీ అక్కర్లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


రెండున్నర గంటలు ఏం మాట్లాడారని అడుగుతున్నారుగా జరిగిందేంటో చెబుతానంటూ పవన్‌ కల్యాణ్‌ వివరించారు. తొలి 10 నిమిషాలు కుశల ప్రశ్నలు వేసుకున్నారట. తర్వాత 20 నిమిషాలు అంబటి అసమర్థత గురించి మాట్లాడారట. పనికిరాని ఐటీ మంత్రి గురించి మరో 18 నిమిషాలు మాట్లాడామని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. ఆ తర్వాత శాంతిభద్రతల సమస్య గురించి 38 నిమిషాలు మాట్లాడారట.. ఇక మిగిలిన సమయం అంతా రాష్ట్ర భవిష్యత్ గురించే మాట్లాడారట. సీట్ల లెక్కల గురించి చంద్రబాబుతో మాట్లాడలేదని పవన్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: