ఏపీ సీఎం జగన్ ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారు. పీఆర్సీ వేశారు. దీంతో చంద్రబాబుకు హామీ ఇచ్చే అవకాశం పోయింది. అంతే కాదు.. 14 ఏళ్లపాటు సీఎంగా అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌పై గతంలో హామీలు ఇచ్చి తప్పారు. ఉద్యోగులందరికీ భ్రమలు కల్పించి ఏమీ చేయలేదనే విమర్శ ఉంది.


అధికారంలో ఉన్నప్పుడు బాబుకు ప్రజలు గానీ, వారికి ఇచ్చిన హామీలు గానీ ఏమీ గుర్తుకురావనే విమర్శలు వస్తున్నాయి. అధికారం పోగానే కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలన్నింటినీ చెప్పగల నేర్పరితనం ఉన్న నాయకుడు చంద్రబాబు అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరిస్తే ఇప్పుడు  జగన్‌కు ఆ అవకాశం వచ్చేదే కాదు. అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గ కమిటీల పేరుతో కాలయాపన చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: