చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటికెలో తయారు చేసుకొని తినగలిగే అల్పాహారం ఏదంటే ఎగ్ఆమ్లెట్.ఈ ఆమ్లెట్ ను ఏ సమయం లో అయినా తినవచ్చు.ఇక రోజు డైట్ ను పాటించే వాళ్ళు పచ్చసొనలో,కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ లో ఉండే వైట్ తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యం.అయితే ఆమ్లెట్ మరింత టేస్టీగా ఉండి మన శరీరానికి మరిన్ని పోషకాలు, క్యాలరీలు అందివ్వాలంటే ఇలా చేయండి.టేస్టీ చీజ్ ఆమ్లెట్ ను తయారు చేసుకొని తినండి. ఇక ఈ వెరైటీ ఆమ్లెట్ చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. 


కావలసిన పదార్థాలు :
గుడ్లు:రెండు..కొత్తిమీర:కొద్దిగా...ఆనియన్స్:ఒకటి...క్యాప్సికం:రెండు స్పూన్లు...నూనె:రెండు స్పూన్లు...గరం మసాలా:స్పూన్... కారం,ఉప్పు:సరిపడా...చీజ్:ఒకకప్పు... పుదీనా:కొద్దిగా...పసుపు:కొద్దిగా...


తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నె తీసుకొని గుడ్లను కొట్టి అందులో వేసి బాగా కలపాలి.. ఆ తరువాత ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి,ఆనియన్స్ తురుము,ఉప్పు,పసుపు వేసి బాగా వేగనివ్వాలి.అందులోనే క్యాప్సికం ముక్కలు,కొత్తిమీర,పుదీనా,ఉప్పు,కారం,గరంమసాలా అన్ని వేసి బాగా వేగనివ్వాలి.దానిని గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలిపి.ఆమ్లెట్ లాగ వేసుకొని ఒక వైపు చీజ్ వేసి మంటను చిన్నగా పెట్టి చీజ్ కరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి..అంతే టేస్టీ గా ఉన్న చీజ్ ఆమ్లెట్ రెడీ..   


మరింత సమాచారం తెలుసుకోండి: