మూడు ముళ్ళు, ఏడడుగులు ఎన్నో  ఆర్భాటాలు  ఇన్నిటి మధ్య  ఒక్కటయ్యే బంధమే భార్య భర్తల బంధం. ఈ బంధంలో  ప్రతి ఒక్కరి జీవితాల్లో  ఎన్నో అవాంతరాలు, కష్టాలు సుఖాలు  లాభాలు నష్టాలు ఇలా మరెన్నో దాటుకుంటూ ముందుకు వెళితేనే ఆ జీవితం సార్థకమవుతుంది. మరియు భార్యకు భర్తపై, భర్తకు భార్యపై  ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలా ఉంటేనే వారి జీవితం  చాలా సాఫీగా సాగుతుంది. అయితే  పెళ్లి అయిన తర్వాత  తన భర్త ఇంకొకరితో మాట్లాడితే తట్టుకోలేని ఈ రోజుల్లో  ఈ భార్య  తన భర్తను మరో అమ్మాయితో పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. ఆమెను దగ్గరుండి వివాహం కూడా చేయించింది. అసలు ఏం జరిగింది.. వివరాల్లోకి వెళితే. వారిద్దరికీ ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వారికి వివాహం అయి ఇన్ని ఏళ్లు గడిచినా  సంతానం కలగకపోవడంతో  ప్రతిరోజు తీవ్రంగా బాధపడేవారు. అయితే ఎలాగైనా  తన భర్త  యొక్క వంశాన్ని  కాపాడుకోవాలని ఆ భార్య ఒక సంచలనమైన నిర్ణయం కూడా తీసుకుంది.

అదేమిటంటే ఆ భార్య తన సొంత చెల్లిని తన యొక్క భర్త కి ఇచ్చి పెళ్లి చేసినది. ఇక ఆ చెల్లి కూడా దీనికి ఒప్పుకుంది. దీంతో వివాహం అనంతరం  ఈ ముగ్గురు  ఆనందంగా ఉంటున్నారు. ఈ సందర్భంలోనే అకస్మాత్తుగా  ఇద్దరు అక్కాచెల్లెళ్లు  కనపడకుండా పోయారు.  మరుసటి రోజు వారి  భర్త అయిన రాధేశ్యాం పొలం పనుల్లో భాగముగా  బావి దగ్గరికి వెళ్ళాడు.

దీనితో షాక్ కు గురి అయ్యాడు. పొలం వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్లు  మృతి చెంది ఉన్నారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఈ యదార్థ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జంజిగిరి ప్రాంతంలో చోటు చేసుకుంది. గతంలో నుంచే ఆ యొక్క అక్కాచెల్లెళ్లకు  మరియు  వారి అన్నదమ్ములకు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ఆస్తి కోసం  కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఈ సమయంలో ఇలా చనిపోవడం సంచలనం రేపుతోంది అని  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: