ఇటీవలి కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మహిళలు కామ కోరల్లో చిక్కు కుంటూనే ఉన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్న కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ టెక్ బిలియనీర్ మైకేల్ గోగన్ రాసలీలలు బయటపడటంతో సంచలనంగా మారిపోయింది. ఏకంగా తన సంస్థలో పనిచేసే మాజీ ఉద్యోగులు ఇక మైఖేల్ పై ఫిర్యాదు చేస్తూ 135 పేజీలో ఫిర్యాదును కోర్టులో సమర్పించారు. కనీసం మాటల్లో చెప్పలేని విధంగా అతను ఏకంగా వేల మంది మహిళలపై దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేశారు.


 ఇలా తమను లైంగికంగా బాధ పెట్టినందుకు కానీ తమకు న్యాయం జరిగేలా చూడాలని ఏకంగా 800 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలి బాధితులు అందరూ కోరుతూ కోర్టులో దావా  వేశారు. ఇక దీనికి సంబంధించి న్యూయార్క్ పోస్ట్ ఒక ప్రత్యేక వార్తను ప్రచురించింది.. మైఖేల్ గోగున్ అనే వ్యక్తి టేక్ రంగంలో రాణించి తక్కువ సమయంలోనే కుబేరుడిగా మారిపోయాడు.  సొంతంగా కంపెనీ పెట్టి ఎంతగానో కష్టపడి కంపెనీ ద్వారా భారీగా లాభాలు పొందాడు.



 ఇక ఆ తర్వాత ఏకంగా టేక్ రంగంలో దిగ్గజ కంపెనీలు గా ఉన్న అన్ని కంపెనీలు కూడా మైఖేల్ గోగున్ సర్వీసుల కోసం క్యూ కట్టేవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంత గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని ఉంటారు. ముఖ్యంగా  మహిళలను వేధిస్తారు అన్న ఆరోపణలు మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.. అయితే ఐదు వేల కంటే ఎక్కువ మంది మహిళలను వేధించాడంటూ ఆరోపణలతో 135 ఫిర్యాదులను కోర్టులో దాఖలు చేశారు బాధితులు. చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టాడు అంటూ.. అని దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి అంటూ తెలిపారు. తమకు ఎనిమిది వందల మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం అందించాలి అంటూ కోర్టులో దావా వేయడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: