ఇటీవల కాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ మనిషిని బానిసగా మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఆరు అంగుళాల మొబైల్ ఆరడుగుల మనిషిని తనకు నచ్చినట్టుగా ఆడిస్తుంది అని చెప్పాలి. ఇక మొబైల్లోనే కొత్త ప్రపంచం దొరుకుతూ ఉండడంతో బయట ప్రపంచం గురించి ఆలోచించడం మరిచిపోయాడు.  మొబైల్ లోనే ప్రేమలు, మొబైల్ లోనే పరిచయాలు.. మొబైల్ లోనే ఉద్యోగాలు ఇలా... అన్ని కూడా మొబైల్ లోనే దొరికేస్తూ ఉన్నాయి.


 ఇక సోషల్ మీడియా అయితే మనిషిని గంటలు తరబడి కట్టి పడేస్తూ సమయం వృధా అయ్యేలా చేస్తుంది. ఇలా ఇటీవల కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో.. ఉదయం ఎంతలా ఫుల్ చార్జింగ్ పెట్టుకున్న.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్యం మొబైల్ అతిగా వాడకానికి ఆ ఛార్జింగ్ కేవలం గంటలు గదిలోనే తగ్గిపోవడం జరుగుతూ వస్తుంది. దీంతో బయటకు వెళ్ళినప్పుడు చార్జింగ్ స్టేషన్ల దగ్గర తమ మొబైల్ ని చార్జింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎంతోమంది మొబైల్ వినియోగదారులు. అయితే ఇలా బహిరంగ ప్రదేశాల్లో యూఎస్బీ చార్జింగ్ స్టేషన్ల వద్ద ఫోన్లు చార్జింగ్ పెట్టడం ప్రమాదకరం అంటూ ఇటీవల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.


 ఎయిర్ పోర్టులు, కేఫ్స్, హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో యూఎస్బీ చార్జర్ స్కాం జరుగుతుంది అన్న విషయాన్ని కేంద్రం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోని చార్జర్ల ద్వారా ఎంతో మంది సైబర్ నేరస్తులు.. ప్రమాదకర మాల్వేర్ ను ఫోన్లోకి పంపిస్తున్నారని.. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం.. చోరీకి గురవుతుంది అన్న విషయాన్ని తెలిపిన కేంద్రం.. మొబైల్ వినియోగదారులు అందరు కూడా హెచ్చరించింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో యూఎస్బీ ద్వారా చార్జింగ్ పెట్టుకోవాలి అనుకునే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: