ఆంధ్రప్రదేశ్లో సినిమాను మరిపించేలా ఓ భారీ రైలు దోపిడీ జరిగింది .. సిగ్నల్ వైర్లు కట్ చేసి మరీ రైలు ఆపి ప్రయాణికుల నుంచి డబ్బు , బంగారం , ఆభరణాలు దోచుకుని దొంగలు పారిపోయారు .. ఇక ఈ ఘటన తో రైల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు .. పూర్తి వివరాల్లోకి వెళితే .. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో కొందరు అగంతకులు సిగ్నల్ కేబుల్ కత్తిరించారు .. ఇక దాంతో ముంబాయి నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్ప్రెస్ ట్రైన్ అక్కడికక్కడే ఆగిపోయింది .. ఇక వెంటనే బోగీలోకి చొరబడిన దుండగులు ప్రయాణికులను భయాందోళనకు గురిచేసి వారి వద్ద ఉన్న డబ్బులు , బంగారం ఆభరణాలు దోచుకున్నారు .. అక్కడి నుంచి ఆ తర్వాత దుండగులు పారిపోయారు ..


అయితే ఈ ఘటనతో రైల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు .. బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు .. అయితే  ఇదే కాకుండా మరో ఇన్సిడెంట్ కూడా జరిగింది .. చెన్నై ఎగ్మోర్ ట్రైన్ లో కూడా దొంగలు హల్చల్ చేశారు .. క్రాసింగ్ కోసం రామలింగయ్య పల్లి రైల్వే స్టేషన్లో ఎగ్మోర్ ట్రైన్ ఆగింది .. ఆ తర్వాత ట్రైన్ కదిలే టైంలో దివ్యభారతి అనే మహిళ ప్యాసింజర్ మెడలో ఉన్న 30 గ్రాముల బంగారం గొలుసును ఓ దొంగ లాక్కుని అక్కడికక్కడే పారిపోయారు .. అలాగే ఆ మహిళ నుంచే కాకుండా ట్రైన్ లో ఉన్న మరికొందరి మహిళల నుంచి కూడా బంగారం గొలుసులు దొంగతనం చేశాడు .. బాధితురాలు దివ్యభారతి కూడా రైల్వే పోలీసులకు తన ఫిర్యాదు అందించండి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: