
ముఖ్యంగా సిద్దార్థ లోత్రా సుప్రీం కోర్టు న్యాయవాది కావడం సీనియర్, చాలా పెద్ద కేసుల్లో వాదనలు వినిపించడం వల్ల ఈజీగా చంద్రబాబును బయటకు తీసుకువస్తాడనే నమ్మకం ఉండేది. ఆయన రిమాండ్ విధించడంతో క్వాష్ పిటిషన్ వేయడంతో చంద్రబాబు వెంటనే బయటకు వస్తాడని నమ్మకం పెట్టుకున్నారు. క్వాష్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. క్వాష్ పిటిషన్ ఉండటం వల్ల కేసుల గురించి వాదనలు వినిపించ లేదు.
ప్రస్తుతం కేసు గురించి వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే రిమాండ్ పొడిగిస్తారా? బాబుకు బెయిల్ వచ్చే అవకాశం లేదా అనే చర్చ బయట సాగుతుంది. అయితే సుప్రీం కోర్టు తలుపు తట్టాలని చూస్తున్నారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం ఆర్థిక నేరారోపణల కేసుల్లో వెసులుబాటు ఇవ్వడం లేదు. లోకల్ గా సీఐడీ వారు కక్ష సాధింపు చేస్తున్నారని వాదనలు వినిపిస్తే సీఐడీ అధికారులను పిలిచి వారి వాదనలు వినాలని సుప్రీం కోరుతుంది.
ఒక వేళ ఈడీ కావాలనే కేసులు వేస్తుందని అనుకుంటే ఈడీ సమాధానాన్ని సుప్రీం కోరుతుంది. కాబట్టి వీరందరూ బాబు కేసుపై సమాధానాలు చెప్పే సరికి చాలా రోజులు పడుతుంది. మరి అప్పటి వరకు చంద్రబాబుకు బెయిల్ దొరక కుండా చేస్తున్నారా అంటే అది నిజమేనని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పటికే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ని ఎలాగైనా బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.