దేశవ్యాప్తంగా వచ్చే రెండు నెలల్లోనే రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ లో ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ ఎన్నిక‌ల‌కు మార్చి నెల‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏపీ కోటాలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు కూడా అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. అయితే ఖాళీ అయ్యే ఈ నాలుగు స్థానాల్లో వైసీపీది ఒక్క‌టే.. మిగిలిన మూడు బీజేపీవే. అంటే ఒరిజిన‌ల్‌గా అవి బీజేపీవి కావు. తెలుగుదేశం పార్టీకి చెందిన‌వి.. అయితే ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు అంద‌రూ ఇప్పుడు బీజేపీ లోనే ఉన్నారు.

జూన్ నాటికి ఖాళీ అయ్యే రాజ్య‌స‌భ స్థానాల్లో విజయసాయిరెడ్డి -  సుజనా చౌదరి - సురేష్ ప్రభు - టీజీ వెంకటేష్ ఉన్నారు. వీరిలో వైసీపీ లో కీల‌క నేత‌గా ఉన్న విజ‌య‌సాయి రెడ్డి రాజ్య‌స‌భ సీటును మ‌రోసారి జ‌గ‌న్ రెన్యువ‌ల్ చేయాల్సి ఉంటుంది. ఆయ‌న‌పై చిన్నా చిత‌కా కంప్లైంట్లు ఉన్నా కూడా ఆయ‌న‌ను మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు పంప‌డం ఖాయ‌మైన‌ట్టే ?  విజ‌య‌సాయిరెడ్డి ప‌ద‌వి రెన్యువ‌ల్‌తో మ‌రొక‌రికి రెడ్డి కోటాలో ఎంపీ ప‌ద‌వి రాదు.

ఇక మ‌రో సీటు బీసీల‌కు ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అయితే గ‌తంలో మంత్రులుగా ఉన్న పిల్లి బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ల‌ను రాజ్య‌స‌భ‌కు పంపారు. వారిద్ద‌రు బీసీలే. అయితే ఇప్పుడు మ‌రో బీసీ వ్య‌క్తికి రాజ్య‌స‌భ ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని కూడా అంటున్నారు. ఒక‌టి రెడ్డి కోటాలో భ‌ర్తీ అయితే మ‌రో మూడు సీట్లు ఉన్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీల్లో ఒక‌రికి ఖ‌చ్చితంగా రాజ్య‌స‌భ సీటు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే జ‌గ‌న్ మాత్రం ప‌క్కాగా సామాజిక స‌మీక‌ర‌ణ‌లు పాటించాల‌ని చూస్తున్నార‌ట‌.

2019 ఎన్నికలకు ముందు కొందరికి రాజ్యసభ పదవి హామీ ఇవ్వ‌డంతో ఇప్పుడు వారంతా త‌మ‌కు ప‌ద‌వులు వ‌స్తాయ‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే పార్టీకి అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డడంతో పాటు ఢిల్లీలో పార్టీ వాయిస్ వినిపించే వారికే రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. ఇక ఉత్త‌రాంధ్ర‌లో బీసీ మ‌హిళా కోటాలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పేరు రాజ్య‌స‌భ రేసులో బ‌లంగా వినిపిస్తోంది.

ఆమె ప్ర‌స్తుతం శ్రీకాకుళం పార్ల‌మెంట‌రీ జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా కూడా ఉన్నారు. ఇక క‌మ్మ కోటాలో ఎమ్మెల్సీని, చేసి మంత్రిని చేస్తాన‌ని చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు హామీ ఇచ్చారు. అయితే ఇన్ని సార్లు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ప‌ద‌వులు భ‌ర్తీ చేసినా మ‌ర్రికి క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌లేదు. ఇక వైసీపీ కోటాలో అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు కూడా రాజ్య‌స‌భ స‌భ్యుడు లేరు. దీంతో మ‌ర్రిని రాజ్య‌స‌భ‌కు పంపితే న్యాయం చేసిన‌ట్లే అవుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే మ‌ర్రికి రాజ్య‌స‌భ ఇచ్చే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ ఈక్వేష‌న్లు ఎలా ?  ఉంటాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: