ఏపీలో వైద్య రంగానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీలో వైద్య రంగం కోసం డిసెంబర్ నాటికి  మరో 432 కొత్త 104–వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.  ఇప్పటికే  676  వాహనాలు సేవలందిస్తున్నాయి. దీనికి కొత్తవి చేరితే వాటి సంఖ్య  1108కి చేరనుంది. ఇప్పటికే సేవలందిస్తున్న 748, 108–వాహనాల  నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని నిర్ణయించారు.


దీనికి తోడు విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని నిర్ణయించారు. దీనికోసం ప్రతినెలా కూడా ఆస్పత్రుల వారీగా ఆడిట్‌ చేయనున్నారు. ఆ‌ నివేదికలు ప్రతి నెలా అధికారులకు చేర్చనున్నారు.  క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించనున్నారు.


వైద్య రంగంలో ఎక్కడ  సిబ్బంది ఖాళీ ఉన్నా వెంటనే మరొకర్ని నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను మానిటర్‌ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు ఆలోచన చేస్తున్నారు. కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణంపైనా ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.


మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై మరింత ధ్యాస పెట్టనున్నారు. అర్బన్‌హెల్త్‌ క్లినిక్స్‌ల నిర్మాణం నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికి  వచ్చాయి. మొత్తం 10 అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయి. ఆరోగ్య రంగంలో సీఎం తీసుకుంటున్న చర్యలకు వచ్చిన గుర్తింపుగా అధికారులు భావిస్తున్నారు. అంతే కాదు.. ఆరోగ్యశ్రీలో 2 వేల 446 చికిత్సలు ఉంటే కొత్తగా మరికొన్ని చేరుస్తునత్నారు. దీంతో  3వేల254 కు  చికిత్సలు చేరనున్నాయి. ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కోసం ఏడాదికి దాదాపు మూడు రెట్లు ఖర్చు పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: