
ఇక్కడ ఈ గొడవకి కారణం కులాంతర వివాహం అని తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ కులాంతర వివాహం చేసుకుందట. ఆమె భర్త భార్గవ రామ్, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని తెలుస్తుంది. అలాగే ఏవి సుబ్బారెడ్డి కుమార్తె అస్మిత కూడా కులాంతర వివాహం చేసుకుందని తెలుస్తుంది. వీరిద్దరూ రెడ్డి కులస్తుల పరువును వేరే కులస్తుల దగ్గర తాకట్టు పెట్టారు కాబట్టి వీళ్ళిద్దరికీ రెడ్డి కులస్తులు ఎవరూ మద్దతు ఇవ్వకండి.
ఇస్తే వాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటూ గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి అనే ఆయన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అనే పేరుతో దానికి సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ నెంబర్, ఇంకా స్టేట్ ఆఫీస్ నెంబర్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. అసలు అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు వాళ్లు వీళ్ళని చెడగొడుతున్నారన్నట్లుగా, దీన్ని రెడ్డి కాపు వర్గాల మధ్య గొడవలా మాట్లాడుతున్నారు. నిజానికి ఏవి సుబ్బారెడ్డి ఇంకా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ లో ఆదిపత్యం కోసం గతంలో గొడవపడ్డారట. అయితే ఆ తర్వాత అఖిల ప్రియ వైఎస్ఆర్సిపి లోకి రావడం మళ్ళీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి రమ్మనడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అసలు గొడవ ఇదని తేలింది.