
ఇలాంటి సమయంలో ప్రపంచంలో ఆర్థిక వృద్ధి రేటు ఇండియాకే ఉందని తెలుస్తోంది. దాదాపు 7 శాతం వృద్ధి రేటులో భారత్ లో ఆర్థిక సంక్షోభం ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు ఈ ఆర్థిక వృద్ధి రేటులో తేడా కనిపిస్తోంది. దాదాపు 6.5 శాతం వద్ద ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. అంటే కరోనా తర్వాత కూడా కోలుకుని విజయవంతంగా కొనసాగిన భారత ఆర్థిక వ్యవస్థ ముందు ప్రస్తుతం ఒక సవాల్ ఎదురు కానుందని తెలుస్తోంది.
2023 లో 7 శాతం వేసిన ఆర్థిక వృద్ధి రేటు అంచనాను తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ధరల ఉదృతి తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వృద్ధి రేటులో జోరు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి గాను వార్షిక వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో మందగమనం, బౌగోళిక, సామాజిక రంగాల్లో వస్తున్న మార్పులు, రాజకీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ ఆర్థిక రంగంలో మరిన్ని ఒడుదొడుకులు ఎదురయ్యే పరిస్థితులు రానున్నట్లు ఆర్బీఐ అంచనా వేసింది.
భౌగోళిక రాజకీయ పరిస్థితులను సమర్థమంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని మందగమనం నుంచి తప్పించుకోవాలంటే నూతన సంస్కరణలు అవసరమని ఆర్బీఐ తెలిపింది. ధరల పెరుగుదల అంచనాను 5.2 శాతంగా పేర్కొంది. స్థిరమైన మారక రేటు, ఎలోనినో ముప్పు తప్పి సాధారణ వర్షపాతం నమోదైతే రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతం తగ్గవచ్చని ఆర్బీఐ తెలిపింది. రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.