అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీకి ఓ ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. అన్ని రకాల వ్యవస్థల్లో టీడీపీ కోసం  ప్రాణాలు అర్పించేవారు,  వారి ఉద్యోగ ధర్మాన్ని పక్కనపెట్టేవారు, దేనికైనా తెగించేవారు ఉంటారు. అదే సమయంలో ఎకో సిస్టంలో అత్యంత కీలకం. మనుషులను ప్రభావితం చేసే వార్తాంశాలు.


తెలంగాణ విభజన సమయంలో కేసీఆర్ హయాంలో దాడులు, రాస్తారోకోలు జరుగుతున్నా చంద్రబాబు చెప్పిందే వార్తాంశం అయిందనే ఆరోపణలున్నాయి.  తెలంగాణ ఉద్యమ కారులు పత్రికలపై దాడులు చేసి, నిలదీసినప్పుడు తెలంగాణ పాత్రికేయులు ఈ అంశాలను అడ్డుకున్నారు. అప్పుడు  ఈ వ్యవస్థను తెలంగాణ వాదం అడ్డుకుంది.  ఒక్క తెలంగాణ విషయంలోనే ఈ వ్యవస్పక్కకు తప్పుకుంది.


తర్వాత తెలంగాణ విభజన జరిగిపోయింది.  ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటి.. తెలంగాణ కావాలి అంటే సానుకూలంగా వార్తలు రాస్తారు.  వద్దు అంటే వ్యతిరేక ప్రచారం చేస్తారు.  అదే సందర్భంలో ఎన్టీఆర్  పై దుష్ప్రచారం వీళ్లే చేస్తారు. ఇప్పుడు  యుగపురుషుడు అని కీర్తిస్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయానికొస్తే రాజకీయ నేర చరితుడు అని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు అదే వైఎస్సార్ పై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. మా మాట వినకుంటే రేపు నీ పరిస్థితి ఇదే అని బెదిరిస్తారు.  జగన్, పవన్ కల్యాణ్, చిరంజీవి ఇలా ఎవర్ని అయినా పైకి తేవాలి అంటే తెస్తారు. తొక్కేయాలనుకున్నా చేయగలరు అనే భావన కలిగిస్తారు.


చంద్రబాబుకు పవన్ అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అతను పత్రికల్లో హీరో అవుతున్నాడు. గత ఎన్నికల్లో అతని పరిస్థితి ఏంటి.  ఈ ఎకో సిస్టం మనం అర్థం చేసుకోపోతే మనం సంపాదించినా, తిన్నా, చివరకు బతికేది కూడా ఆయన వల్లనే అనే భావన కలిగిస్తారు. ఒకప్పుడు టీడీపీ ఎకో సిస్టం ను ఎదుర్కొన్న జనసేన వీరితో కలిసింది.  ఇప్పుడు వీరు జడ్జి నుంచి పాత్రికేయుల వరకు ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకొని వీరు అనుకున్నది సాధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: