కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్  విధానం అనేది చంద్రబాబు  వచ్చిన తర్వాత, అంటే 2004 తర్వాత విపరీతంగా అమల్లోకి వచ్చింది. ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు సరైన  సమయానికి జీతాలు అందించాల్సి రావడం, అంతే కాకుండా వాళ్లకి జీతాలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జాబ్స్ ను ఎంకరేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంప్లాయిస్ ని తీసుకోవడం అనే దాని వల్ల జీతాలు అనేవి కొంత వరకు కలిసి వస్తాయి.


అంతే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్  ఉద్యోగులుగా చేస్తున్న వాళ్లకి వాళ్ల ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఈ పెన్షన్స్ ద్వారా ఇచ్చే సొమ్ము కలిసి వస్తుంది.  ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఇస్తూ ఉండడంతో పనులు సరిగా చేయడం లేదని, మాట వినడం లేదని  అప్పటి ప్రభుత్వం భావించింది.  అయితే ఈ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్  ద్వారా పనిచేసే ఉద్యోగులకు తమ పనిపై భయం, భక్తి ఉంటాయని అప్పటి ప్రభుత్వం భావించింది.


అంతే కాకుండా వీళ్ళ ఉద్యోగాలు పర్మినెంట్ కాకపోవడంతో ఎప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అని భయంతో సక్రమంగా పని చేస్తారని కూడా ఆ ప్రభుత్వం అనుకుంది. జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వాటిలో ఒక పావు శాతం ఇస్తే సరిపోతుంది. అంతేకాకుండా వాళ్లకి పెన్షన్లు  ఇవ్వక్కర్లేదు, కాబట్టి ప్రభుత్వానికి కూడా ఖర్చు కలిసి వస్తుంది అనుకున్నారు.


అయితే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆ పాదయాత్ర సందర్భంగా ఈ ఔట్ సోర్సింగ్  విధానాన్ని క్రమబద్ధీకరిస్తానని అన్నాడట. తాజాగా క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం దీనికి సమ్మతించింది అని తెలుస్తుంది. 2014తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్  విధానంలో జాబ్ చేస్తున్నారో వాళ్ళ జాబ్స్ ను క్రమబద్ధీకరించడానికి సమ్మతించింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: