- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ )

బిఆర్ఎస్ నేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే మేము అంతా పనిచేస్తున్నాం ఆయన ఉన్నప్పుడు అసలు నాయకత్వ సమస్య ఎందుకు వస్తుంది ? ఇది నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి.. ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు పలు సందర్భాలలో చెప్పిన మాట. అయితే కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ రజతోత్సవ స‌భ సమయంలో ప్రధాన వేదికపై కేవలం కేసీఆర్ - కేటీఆర్ ఫోటో మాత్రం పెట్టారు. ఇది కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పాటు సీనియర్ నేత హరీష్ రావుకు కూడా ఏమాత్రం రుచించలేదు. హరీష్ రావు ఎక్కడ కూడా అధిష్టానం పై అసంతృప్తి వ్యక్తపరిచే పనులు చేయకపోయినా ఎమ్మెల్సీ కవిత మాత్రం కొద్దిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు బి ఆర్ ఎస్ లో కలకలం రేపుతున్నాయి అని చెప్పాలి. గత పదేళ్ల‌ కాలంలో అంటే బిఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని కవిత ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.


తనపై పార్టీలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు .. పార్టీ దీనిని ఖండిస్తోంది అని భావిస్తున్నట్లు ప్రకటించిన ఆమె మరింత కలకలం రేపారు. లేకపోతే తర్వాత దీని వెనక ఉన్నవాళ్లు పేర్లు అన్ని బయటపెడతా అని కవిత అంటున్నారు. తాజాగా హరీష్ రావు మంగళవారం చేసిన కామెంట్లు మరింత సంచలనంగా మారాయి. కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తాను.. తప్పకుండా నేను సహకరిస్తా నేను ఏనాడూ కూడా కేసీఆర్ నిర్ణయాన్ని త‌ప్పుప‌ట్ట‌లేద‌ని.. ఆయ‌న గీసిన‌ గీత దాటను .. 25 ఏళ్ల నుంచి అదే చేస్తున్నాను భవిష్యత్తులోనూ అదే చేస్తాను అన్నారు హరీష్ రావు. ఒకవైపు కవిత ..మరోవైపు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలో బీఆర్ఎస్ పగ్గాలు కేటీఆర్ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ సాగుతుంది. కేవలం బీఆర్ఎస్ పగ్గాల వరకే వెళతాయా లేక ప్రతిపక్ష హోదా కూడా మారుతుందా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: