అమెరికా అంటేనే ఎంతో భయపడుతున్నారు మ‌న విద్యార్థులు .. అలాగే అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు .. ఇక ఇప్పుడు ఈ లిస్టులో ఏ దేశాలు ఉన్నాయి ? అగ్రదేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై నిపుణులు ఏమంటున్నారు అనే విషయాలు కాస్త వివరంగా ఇక్కడ తెలుసుకుందాం .. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్నా నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర గందరగోళంలోకి తోసేస్తున్నాయి .. మరియు ముఖ్యంగా విద్యార్థి వీసాల చుట్ట తెలియని అయోమయ స్థితి నెలకొంటుంది .
 

ఈ క్రమంలో వేలాదిమంది భారతీయ విద్యార్థుల కల అక్కడే ఆగిపోతుంది .. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారే కాకుండా ఇప్పటికే అక్కడి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థుల ప్రణాళికలు సైతం ట్రంప్ నిర్ణయాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి .. ఇలా మొత్తంగా అమెరికా వెళ్లాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులు ఎంతో కఠినంగా కనిపిస్తున్నాయి .. ఇక దీంతో విద్యార్థులు ఇతర దేశాల వైపు ఎక్కువ చూస్తున్నారు. జర్మనీ, రష్యా, హాంకాంగ్‌, యూకే, యూరప్‌, ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది .. హాంకాంగ్ సహా  పలు దేశాల్లో స్కాలర్షిప్ తో పాటు ఆర్థిక సాయం కూడా ఉండడంతో అమెరికా వెళ్లాలన్న ఆలోచన మార్చుకుంటున్నారు ..



 అలాగే అమెరికాలో వీసా ఆంక్షలు రోజురోజుకు కఠినంగా మారుతున్న క్రమంలో అమెరికా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఏమీ చేయకుండా ఉండట మంచిదని పేరెంట్స్ కూడా తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు .. అంతేకాకుండా విద్యార్థుల భద్రత మనశ్శాంతి ముఖ్యమని అంటున్నారు .. అందుకే మాకొద్దీ అమెరికా అనే సిచువేషన్ కు వచ్చినట్లు పలు సర్వేలు కూడా చెబుతున్నాయి .. అయితే అమెరికాలో ఈ సమస్యలు  తాత్కాలికమేనని .. ఇక త్వరలోనే అంత సర్దుకుంటుందని పలువురు నిపుణులు అంటున్న .. ప్రస్తుతం విద్యార్థులు , తల్లిదండ్రులు మాత్రం అమెరికా అంటేనే  ఆమడ దూరం పరిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: