ఆడ వారిలో పిసిఓడి (పోలీ  సైస్టిక్  ఒవేరియన్  డిసీస్ ) వున్నపుడు.
*వంశపారంపర్యము* (కొంతవరకు)
* ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..  

*వ్యక్తిగత జాగ్రత్తలు :-*
* ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి
* జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.
* ప్రతిరోజూ వ్యాయామము చేయాలి
* మొటిమలు చిదపడము , గోకడము చేయరాదు.
* గట్టిగా తువ్వాలు తో ముఖము తుడవరాదు.
- పింపుల్స్‌ను గిల్లకూడదు
- మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.
- తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
- నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
- మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
- స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
- గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
- మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లు వైద్యసలహా లేకుండా రాయకూడదు.

- సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
- రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
పింపుల్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.శరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు.

*ప్రత్యామ్నాయాలున్నాయి...
మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పిల్స్ లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు.

ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని
 గృహ-చిట్కాలు...

ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని సేవించండి లేదా చర్మం మీదకూడా పూయవచ్చు. గర్భిణులు ఆలోవెరా గుజ్జును సేవించకూడదు.
దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
కమలా పళ్ళ తొక్కలను ఎండ పెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
*మొటిమలతో జాగ్రత్తలు :*
చూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
* రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
* మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
* కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: