ఆల్కహాల్ ని ఎక్కువ గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ యొక్క ఫ్రంటల్ లోబ్స్ ష్రింక్ అవుతాయి. ఆల్కహాల్ ఎక్కువ కన్‌స్యూం చేసేవారు వారి ప్రవర్తన మీద అధికారాన్ని కోల్పోతారు. డెసిషన్ మేకింగ్ పవర్ పూర్తిగా పోతుంది.ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు.
మెదడు జ్ఞాపకాలను స్టోర్ చేసుకునే ప్రాసెస్ తో ఆల్కహాల్ ఇంటర్ఫియర్ అవుతుంది. దాంతో తాగినప్పుడు ఏం చేస్తారో గుర్తుండదు.ఆల్కహాల్ మీద బాగా డిపెండ్ అయిపోయిన వారు ఈ అలవాటు లోనుండి బయట పడాలని చేసే ప్రయత్నంలో ఎన్నో చిరాకులు ఎదుర్కొంటారు. వాటిలో భ్రమకీ, భ్రాంతికీ లోనవడం కూడా ఒకటి. లివర్ ని డ్యామేజ్ చేసి లివర్ ఫంక్షన్ ని దెబ్బతీస్తుంది.టీబీ, న్యుమోనియా వంటి వ్యాధులు ఈజీగా దాడి చేస్తాయి.
ఆల్కహాల్ వలన ఎనీమియా కూడా రావచ్చు. దాన్నించి నీరసం, నిస్త్రాణ వస్తాయి.ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుంది.గర్భిణీ స్త్రీలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే పుట్టే పిల్లలు మానసిక అవకరాలతో జన్మించే రిస్క్ చాలా ఎక్కువ.ఎముకలు బలహీన పడిపోయి ఆస్టియోపొరాసిస్ రావచ్చు.కో ఆర్డినేషన్ దెబ్బ తింటుంది. బాలెన్స్ కోల్పోతారు. సరిగ్గా నడవలేరు.బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా బ్యాలెన్స్ అవ్వవు.చేతులూ, పాదాలు మొద్దు బారినట్టు ఉండడం, తిమ్మిరెక్కడం, నొప్పిగా ఉండడం వంటివి ఆల్కహాల్ వల్ల సెంట్రల్ నెర్వస్ సిస్టం దెబ్బ తినడానికి సూచన. కాబట్టి ఆల్కాహాల్ కి అసలు అలవాటు పడకండి. నిత్యం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి