రాత్రిపూట దగ్గు సమస్యను ప్రతి ఒక్కరూ ఎదో ఒక సమయంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉండుంటారు. గొంతులో కిచ్ కిచ్ అనేది ఎంతో చికాకును కలిగిస్తుంది. నిద్ర డిస్టర్బవుతుంది. అర్థరాత్రి వేళ దగ్గు వల్ల మెలకువ వస్తుంది.

నిజానికి దగ్గు అనే ప్రక్రియ ఏంది లంగ్స్ ను రిలాక్స్ చేసేందుకు తోడ్పడే ప్రాసెస్ అనంటారు. మ్యూకస్, మైక్రోబ్స్ అలాగే పొల్యూటెంట్స్ వల్ల లంగ్స్ ఇరిటేట్ అవడంతో దగ్గు వస్తుంది. రాత్రి పూట దగ్గును ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కారణం తెలుసుకుంటే పరిష్కారాన్ని కనుగొనడం సులభమవుతుంది. లైఫ్ స్టైల్ ఛేంజెస్ ను కూడా ప్రయత్నించవచ్చు. వివిధ రెమెడీస్ ను ట్రై చేయవచ్చు.  

1. తలకింద తగినంత ఎత్తులేకుండా పడుకుంటే నిద్రలో దగ్గు వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే, తలని ఎత్తులో ఉంచి నిద్రించాలి. అదనపు తలగడలను వాడి తల పొజిషన్ ను ఎత్తులో ఉంచుకోవాలి.  

2.హ్యుమిడిఫయర్ ను వాడటం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. పొడిగాలి గొంతును అలాగే ఎయిర్ వేస్ ను ఇరిటేట్ చేయవచ్చు. కొంతమంది శీతాకాలంలో హీటర్ ను ఆన్ చేయడం ద్వారా దగ్గు సమస్య బారిన పడతారు. హీటింగ్ ప్రోడక్ట్స్ లో పేరుకుని ఉన్న కాలుష్య కారకాలు గాల్లోకి విడుదలవడం కూడా దగ్గుకు కారణం. హ్యూమిడిఫయర్ అనేది గదిలోని గాలిని తేమగా ఉంచుతుంది. దాంతో, గొంతు ఇరిటేషన్ తగ్గుతుంది.  

3. వేడి నీటిలో తేనెను కలిపి తాగితే మ్యూకస్ కరిగిపోతుంది. కెఫైన్ ఫ్రీ టీలో అంటే హెర్బల్ టీలో రెండు టీస్పూన్స్ తేనెను కలపండి. నిద్రపోయేముందు తాగండి. సంవత్సరం కంటే చిన్నపిల్లలకు తేనెను ఇవ్వకూడదు.

4. పొడిదగ్గు అనేది ఆస్తమాకు చెందిన లక్షణం. రాత్రిపూట దగ్గు వేధిస్తుంది. ఎయిర్ వేస్ వాచడం జరుగుతుంది. ప్రిస్క్రిప్షన్ ఇన్హేలర్ ను వాడితే రిలీఫ్ ఉంటుంది.
5. దీర్ఘకాల దగ్గు అనేది లాంగ్ టర్మ్ స్మోకింగ్ కు చెందిన ప్రధాన సైడ్ ఎఫెక్ట్. దీనికి సత్వర పరిష్కారమంటూ ఏదీ ఉండదు. డాక్టర్ తో మాట్లాడి ఈ హ్యాబిట్ ను తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. దగ్గు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: