ఇంటర్నెట్ డెస్క్: సాధార‌ణంగా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్‌ను చూస్తుండటం వ‌ల్ల చాలా మంది త‌లనెప్పి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటారు. ఉరుకుల ప‌రుగ‌ల జీవితంలో ప‌ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌, వాయిస్ పొల్యూష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు, స‌రైన స‌మ‌యానికి తిన‌క‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యల్లో ప్రధానమైదని తలనెప్పి. ఈ తలనెప్పిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. ఫలితం అంతమాత్రంగానే ఉంటుంది. కానీ ఓ చిన్న చిట్కాతో తననొప్పిని క్షణాల్లో దూరం చేసుకోవచ్చని తెలుసా..? ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌ల‌నొప్పి రాగానే చాలా మంది ట‌క్కున పెయిన్ కిల‌ర్స్ వేసేసుకుంటారు. కానీ, పెయిన్ కిల‌ర్స్ శరీరానికి హాని కలిగిస్తాయి. వాటికి అలవాటు పడితే అనేక అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే. పెయిన్ కిల్లర్లతో పనిలేకుండా ప్రకృతి సిద్ధంగా తయారైన విధానంలో తలనెప్పిని తగ్గించుకోవాలంటే మన వంటింట్లోని వస్తువులే గొప్ప ఔషధాలుగా ఉపయోగపడతాయట.

గ్లాసు నీటిలో జీల‌క‌ర్ర‌, అల్లం ముక్క‌లు, కొత్త‌మీర వేసి బాగా సన్నటి మంటపై మరిగించాలి. కాస్త గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత పొయ్యిపై నుంచి దించి తాగాలి. దీనివల్ల చిటికెలో తలనెప్పి దూరమవుతుంది. ఇది ఒక్కటే కాదు.. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు రాతి ఉప్పు క‌లిపి, బాగా కలిపి తాగేయాలి. దీనివల్ల కూడా తలనెప్పి స‌మ‌స్య కచ్చితంగా దూరమవుతుంది. వీటితో పాటు తలనెప్పిని నిమ్మ ర‌సం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. త‌ల‌నొప్పితో ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో ఒక స్పూన్ నిమ్మ ర‌సం క‌లిసి తీసుకుంటే తలనెప్పి పూర్తిగా దూరమవుతుంది. యాపిల్, ఆరెంట్‌, దానిమ్మ, ద్రాక్ష వంటి ఫ్రూట్స్‌ను తిన్నా కూడా తలనెప్పి నుంచి త్వ‌ర‌గా కోలుకోవచ్చు.

ఇవన్నీ తలనెప్పి వచ్చిన తరువాత తగ్గించుకునే చిట్కాలు. అయితే అసలు తలనెప్పి రాకుండా చేసుకోవాలన్నా కూడా కొన్ని చిట్కాలున్నాయి. అవేటంటే..
కంప్యూటర్స్‌, ల్యాప్ టాప్స్ ముందు ఎక్కువగా పనిచేసేవారు ప్రతి గంట‌కు 5 నిమిషాలయినా రెస్ట్ తీసుకోవాలి. ఇక శరీరంలో కొన్నిసార్లు నీరు శాతం తక్కువైనా తలనెప్పి వ‌చ్చే అవ‌కాశాలుంటాయి. అందువల్ల ప్ర‌తి రోజు శ‌రీరానికి స‌రిప‌డా నీరు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: