
ఉడకబెట్టిన వేరుశెనగలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ లో కలిగి ఉన్న అన్ని పోషకాలు, ఈ వేరుశనగ లో ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వేరుశనగను ఉడికించి రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన వేరుశనగలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని అవయవాల ఎదుగుదలకు ఉపయోగపడే బి కాంప్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి. ఇక అంతేకాకుండా విటమిన్ డి శరీరంలో ఎర్రరక్తకణాలు పెరుగుదలకు తోడ్పడి, రక్తహీనత సమస్య నుంచి బయటపడేలా చేస్తాయి.
వేరుశనగలో ఫ్లేవనాయిడ్స్,పాలీఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది శరీరంలో రక్షణ వ్యవస్థకు నష్టం కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్, గుండెజబ్బులు, షుగర్ వంటి సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతాయి.
వేయించిన వేరుశనగలలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అదే ఉడికించిన వేరుశనగ క్యాలరీలలో తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన వేరుశనగ తినడం ఉత్తమం.
ఉడికించిన వేరుశనగలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణ సంబంధిత సమస్యలను సులభంగా నయం చేయడంతోపాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
సాయంత్రం పూట ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల నీరసం నుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా మెదడు పెరుగుదల,శరీర కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఉడికించిన వేరుశెనగలలో మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండడం వల్ల,గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసి, గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఉడికించిన వేరుశెనగలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల వీటిలో ఉన్న మెగ్నీషియం, ఎముకలతో పాటు నరాలను ఉత్తేజితం చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
పోషక లోపంతో బాధపడుతున్న వారు ఉడికించిన వేరుశనగ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి.కాబట్టి వీలైనంత వరకూ ఉడకబెట్టిన వేరుశనగ గింజలను రోజూ వారి ఆహారంలో తీసుకోవడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.