ఒక నెల రోజులు కాని లేదా అంతకంటే ఎక్కువ రోజులు కాని మీకు భరించలేని ఛాతి నొప్పి ఇక ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు బాగా దగ్గు అనేది వస్తే మీరు తప్పకుండ వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే మీరు ఎన్నో ప్రమాదకర ఇంకా చెప్పాలంటే ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే శ్లేష్మం ఇంకా కఫం వచ్చిన అది ప్రాణంతక లక్షణం అని గుర్తు పెట్టుకోండి. ఇది అనేక రకాల అంటువ్యాధుల కారణంగా మీకు వస్తుంది. శ్లేష్మం ఒక నెల రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కనుక మీకు వస్తున్నట్లయితే..అప్పుడు మీరు ఊపిరితిత్తులు వ్యాధి బారిన పడినట్లే అని ఖచ్చితంగా తెలుసుకోవాలి.అందుకే జాగ్రత్తలు తీసుకోండి.ఇక ఎటువంటి డైటింగ్ అలాగే వ్యాయామం అనేవి ఏమి చేయకుండానే మీ శరీర బరువు గనుక తగ్గుతున్నట్లయితే..మీరు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నట్లే అని ఖచ్చితంగా గుర్తించాలి.ఇది శరీరం పంపుతున్న సంకేతంగా ఖచ్చితంగా భావించాలి.

ఇక అలాగే మీరు శ్వాస తీసుకోవడంలో ఏమైన సమస్య ఎదుర్కొన్నా లేదా వెంటనే వెంటనే ఊపిరి పీల్చుకున్నా గాని అది ఊపిరి తిత్తులు వ్యాధి బారినపడిట్లు మీరు ఖచ్చితంగా గుర్తించాలి. ఊపిరితిత్తులలో కణితి ఇంకా అలాగే కార్సినోమా నుంచి ద్రవం ఏర్పడటం వలన గాలి పీల్చుకోవడంలో బాగా ఇబ్బంది తలెత్తడం జరుగుతుంది.ఇక మీకు కనుక ఎనిమిది వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు రక్త చారలతో కూడిన దగ్గు కనుక మీకు వస్తున్నట్లయితే అది ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించబడుతుంది. అందుకే శ్వాసకోస వ్యవస్థలో ఏదో తేడా జరుగుతుందని వెంటనే మీరు గమనించాలి. లేదంటే మీ ప్రాణానికి పెద్ద ముప్పు తప్పదనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.ఇక ఈ లక్షణాలు ఇంకా సంకేతాలన్నీ కనుక మీరు మీ శరీరంలో గమనించినట్లయితే.. వెంటనే మీరు ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి. ఒకవేళ కనుక మీరు అశ్రద్ధ కనుక చేస్తే భవిష్యత్తులో అనేక ప్రాణంతక సమస్యలు అనేవి ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: