ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా అందరి ఇళ్ళల్లో.. ఒక టీవీ లేదా, మొబైల్  కచ్చితంగా ఉండనే ఉంటుంది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో.. ధనిక, పేద అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ , టీవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా వీటిని ఎక్కువగా వాడడంతో చాలా అనర్ధాలు వస్తాయని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీటి ఎఫెక్టు పిల్లలపై పడుతుందని తెలియజేశారు. వీటిని ఎక్కువగా చూస్తే పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతారట. ఇక ఇప్పుడు వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.

ఎక్కువగా పిల్లలు మొబైల్, టీవీ ఉపయోగించినట్లయితే.. వారి చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా.. వారికి ఏమీ తెలియకుండా పోతుంది. ఇక  వాటిలోకి వీరు లీనమై కదలకుండా ఉంటారు. ఇలా ఉండడం తో పిల్లలు చాలా బరువుగా తయారవుతారు. ముఖ్యంగా కంటి చూపు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అంతే కాకుండా ఇతరులతో కలవడానికి చాలా మొహమాటంగా ఉంటారు. ముఖ్యంగా ఎవరు ఏం మాట చెప్పినా వినకుండా స్మార్ట్ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడానికి ఇష్టపడతారు.

మన భోజనం చేసేటప్పుడు చిన్న పిల్లలకి.. మొబైల్ ఇస్తూ తినమని చెబుతూ ఉంటాము.. అలా చెప్పడంతో వారు ఎంత తింటారో లేదో కూడా తెలియదు. ఇక ఇలా టీవీ, మొబైల్ చూస్తూ ఉంటే వారు ఆడుకోవాల్సిన ఆటలను మర్చిపోతూ ఉంటారు. ఇక మొబైల్ లో కనిపించే పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెడతారు పిల్లలు. ఇలా అధికంగా ఉపయోగిస్తే వారు చాలా ప్రమాదానికి గురవుతారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది.

పిల్లలు 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటే.. మధుమేహం, హృదయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకోసమే వీటికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని తెలియజేస్తున్నారు వైద్యనిపుణులు. ముఖ్యంగా వీలు దొరికినప్పుడల్లా తమ పిల్లలతో సరదాగా గడపమని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: