తేనె..శరీర ఆరోగ్యానికి, చర్మ రక్షణకు, జుట్టు సమృద్ధిగా పెరిగేందుకు దివ్యౌషధం అని కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. అందుచేతనే ఎక్కువమంది షుగర్ కు బదులుగా తేనె ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో అవసరానికి మించి తేనె ఎక్కువగా తిన్నట్లయితే దీని వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయ ని కొంత మంది వైద్య నిపుణులు తెలియజేయడం జరుగుతోంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1). బరువు పెరగడం:
ఎక్కువగా కొంతమంది గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ తేనెను వేసుకొని తాగుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని అభిప్రాయపడుతూ ఉంటారు.. కానీ చక్కెర కంటే ఎక్కువ శాతం తేనె తీపి కలిగి ఉండటం వలన బరువు పెరగడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు తెలియజేయడం జరిగింది.

2). దంతాలు:
ఎక్కువ మోతాదులో తరుచూ తేనె తీసుకున్నట్లు అయితే నోటి లో చెడు బ్యాక్టీరియా వ్యాప్తి చెంది దంతాలపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా నోటి నుండి చెడు వాసన కూడా వచ్చే అవకాశం ఉంటుందట.

3). రక్తపోటు:
రక్త పోటు సమస్య తో ఇబ్బంది పడేవారు తేనెకు చాలా దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరిగింది.. ఎందుచేత అంటే తేనె రక్తపోటును మరింత పెరిగేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.


4). జీర్ణక్రియ:
ఎక్కువ మోతాదులో తేనెను తీసుకున్నట్లయితే జీర్ణక్రియ పై చెడు ప్రభావం చూపిస్తుందట.. అంతే కాకుండా దీని వల్ల కడుపు నొప్పి, డయేరియా తో పాటు ఇతర అనారోగ్య సమస్య లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలియజేయడం జరుగుతోంది.


రక్తంలో చక్కెర స్థాయిలు ఉంటాయి కాబట్టి తేనె ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటి మోతాదు ఎక్కువగా రావడం జరుగుతుంది.. దీంతో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయాయని కొంతమంది నిపుణు లు తెలియజేశారు. అందుచేతనే తేనెను కాస్త పరిమితి గానే తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: