సాధారణంగా పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎంత దృష్టి సారిస్తారో పెద్దయిన తర్వాత వారి ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో వారికి ఎలాంటి ఆహారాలు ఇస్తున్నాము అన్న విషయాన్ని తప్పకుండా గుర్తించుకోవాలి. అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచే ప్రాసెస్డ్ ఫుడ్,  బేకరీ ఫుడ్ , జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటివి ఇస్తే మాత్రం చిన్నవయసులోనే షుగర్ రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ పిల్లలు తినడం వల్ల సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందట. దీనివల్ల ఇలాంటి ఆహారాలు తీసుకునే వారి మెదడు మొద్దు మారిపోవడం, ఏకాగ్రత దూరం అవ్వడం, డిప్రెషన్ కి గురవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక చిన్న పిల్లలకు స్వీట్స్ లాంటి ఆహార పదార్థాలను కూడా ఇవ్వకూడదు. స్వీట్స్ , కేక్స్ , బేబీ ఫుడ్స్, ఐస్ క్రీమ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్నవారికి చిన్న వయసులోనే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను కూడా వారు తినకపోవడం మంచిది.

ఇంకా చెప్పాలంటే పిల్లలు కలర్ఫుల్ ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి ప్యాకేజీ ఫుడ్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఇవ్వకూడదు.  వీటిలో ఉండే రసాయనాలు పిల్లల మెదడుపై ప్రభావితం చూపిస్తాయి. కొంచెం కష్టమైనా సరే పిల్లలకు శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారాలను అందివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక చాక్లెట్స్,  ఐస్ క్రీమ్ వంటి వాటిని పిల్లలకి సాధ్యమైనంత దూరంగా ఉంచండి. వీటిలో ఉండే కెఫిన్ వారి ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల చిన్న పిల్లల్లో నిద్రలేమి,  తలనొప్పి,  కడుపులో మంట , నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.  కాబట్టి చిన్న పిల్లల ఆరోగ్యం పై తప్పకుండా జాగ్రత్త వహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: