తులసి ఆకులను, పుదీనా ఆకులను నీటిలో వేసి ఉడికించాలి. తరువాత ఈ నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఉదయం పూట చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఇలా నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అదే విధంగా రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో తులసి ఆకులు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.గోరువెచ్చని నీటిలో తులసి ఆకుల పొడి వేసి కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. అలాగే తులసి ఆకుల రసాన్ని తీసి ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులతో పాటు ఒక టీ స్పూన్ తేనె వేసి కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.


ఈ నీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారి శక్తివంతంగా తయారవుతారు. పరగడుపున తులసి ఆకులను నమిలి తినడం ఎంతో మంచిది. తులసిలో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజూ తులసి ఆకులను నమిలి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తులసి మొక్కను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తూ ఉంటారు. అయితే తులసి ఆకులను రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున తులసి ఆకులను తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ విధంగా తులసిఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: