
ఈ విషయం పైన అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా రాబోతున్నాయని అలాగే లాక్ డౌన్ గురించి కూడా సూక్ష్మమైన సూచన ఉండబోతోంది హింట్ తింటూ ఇచ్చారు. కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అంటూ తెలియజేశారు. అవసరమైన చోట వృద్ధులు మరియు పిల్లలకు కరోనా పరీక్షల కోసం ప్రత్యేకించి మరి సెంటర్లను నిర్వహించబోతున్నామంటూ తెలియజేశారు.
నిన్నటి రోజున కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారని మరణించిన వృద్ధుడికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు.. అయితే పరిస్థితులను బట్టి మళ్లీ కూడా లాక్ డౌన్ అనే విషయాన్ని పరిశీలించబోతున్నామంటూ ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూ తెలియజేశారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలి అంటూ తెలియజేశారు. ముఖ్యంగా బెంగళూరు నగరంలో 32 కేసులు, మైసూరులో 2, విజయనగరం ,బళ్లారి, బెంగళూరు వంటి ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని తెలియజేశారు.
రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే కచ్చితంగా మళ్ళీ అన్ని ప్రాంతాలలో కూడా దేశం మొత్తం లాక్ డౌన్ వచ్చే పరిస్థితి ఉంటుంది అంటూ ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.