జూన్ 9వ తేదీన ఒకసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 నందిని సత్పతి  జననం :  ఒరిస్సా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన నందిని సత్పతి 1931 జూన్ 9వ తేదీన జన్మించారు. జూన్ 19 1972 నుంచి డిసెంబర్ 1976 వరకు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు నందిని. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్న నందిని  స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ తరువాత 1951లో ఫీజులు పెరిగినందున దాని  నిరసిస్తూ ఒడిశాలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం వ్యాపించగా ఈ ఉద్యమానికి నందిని నాయకత్వం వహించారు, ఆ సమయంలో ఆమె లాఠి  దెబ్బలను కూడా చవీ చూసారు.  ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు నందిని సత్పతి. 

 


 గాలి ముద్దుకృష్ణమనాయుడు జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947 జూన్ 9వ తేదీన జన్మించారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు  పదవులను అలంకరించారు. పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి 6 సార్లు ప్రాతినిథ్యం వహించారు గాలి ముద్దుకృష్ణమనాయుడు.  ఆటవిక శాఖ ఉన్నత విద్యా మంత్రిగా కూడా సేవలందించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా చేతిలో పరాజయం పాలయ్యారు  గాలి ముద్దుకృష్ణమనాయుడు. తర్వాత చనిపోయేవరకు ఎమ్మెల్సీ గా  సేవలందించారు.

 

 కిరణ్ బేడీ జననం  : భారతదేశంలో ఎంతగానో  గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ. కిరణ్ బేడి టెన్నిస్ ప్లేయర్ పొలిటిషన్ కూడా. ఈమె పుదుచ్చేరికి ఏకంగా లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా పని చేశారు. కిరణ్ బేడి 1949 జూన్ 9వ తేదీన జన్మించారు.పోలీస్ ఆఫీసర్ గా  దేశంలో ఎన్నో సేవలు అందించారు కిరణ్ భేడి . అప్పట్లో కిరణ్ బేడీ సేవలకు  ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. 

 


 తెలంగాణ శకుంతల జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి అయినా తెలంగాణ శకుంతల 1951 జూన్ 9వ తేదీన జన్మించారు. తెలంగాణ శకుంతల తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కొసమెరుపు. తనదైన మేనరిజంతో తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ.. తన నటనతో  ఎంతో  మంది తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రతినాయకురాలి  పాత్రలు   హాస్యనటి పాత్రలు  పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది తెలంగాణ శకుంతల. 1979లో మా భూమి అనే సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు తెలంగాణ శకుంతల. 75కి పైగా సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు. 

 

 ఎం ఎఫ్ హుస్సేన్ మరణం : భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది వ్యక్తి ఎం.ఎఫ్.హుస్సేన్. దాదాపు ఏడు దశాబ్దాలుగా కళాకారుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఫోర్బ్స్ మ్యాగజైన్  ప్రకారం భారతీయ పికాసో తన విజయవంతమైన ప్రస్థానంలో 1970లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం మోపబడింది, ఇక  ఈయన 2011 జూన్ 9వ తేదీన మరణించారు. 

 

 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అయినా పాల్వాయి గోవర్దన్రెడ్డి 2017 జూన్ 9వ తేదీన మరణించారు. పాల్వాయి  యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా అందులోనే కొనసాగారు. నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కుటుంబాలతో ఆయనకు మంచి పరిచయం ఉంది. 1967 లో  మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో కూడా పనిచేశారు ఈయన.

మరింత సమాచారం తెలుసుకోండి: