పచ్చి బఠాణీలను ఇటీవల చాలామంది ప్రతి వంటకాలలో జోడించడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఉడకబెట్టి పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి కావలసిన పోషకాలు అందివ్వడమే కాకుండా వారు కూడా ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ఇలాంటి పచ్చిబఠాణీ లను, ప్రతి రోజూ మన ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి అని వైద్యులు చెబుతున్నారు. ఈ పచ్చ బఠాణీలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి..అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1. చర్మం ముడతలు:
పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్ లు ,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల మన శరీరంలో వయసుతో వచ్చే ముడతలను నివారించుకోవచ్చు.


2. తాజా పచ్చిబఠాణీలలో ఫోలిక్ ఆమ్లాలు పుష్కలంగా నిల్వ ఉంటాయి. మహిళలు గర్భం దాల్చడానికి , మహిళల కణాల డిఎన్ఏ కు ఫోలిక్ అవసరం. అందుకే ఈ పచ్చిబఠాణీలను సంతానం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు అందివ్వడమే కాకుండా, గర్భం దాల్చిన మహిళలకు కూడా పుష్కలంగా ప్రతిరోజు ఇస్తూ ఉంటారు

3. పచ్చి బఠాణీలలో ఉండే ఫైటో  స్టెరాల్ కారణంగా, శరీరంలో ఏర్పడిన కొవ్వు నిల్వలను కరిగించి వేస్తుంది.

4. అంతేకాదు తాజా పచ్చిబఠాణీలలో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మన శరీరంలోకి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

5. అంతేకాదు పచ్చిబఠాణీలలో విటమిన్ కె పుష్కలంగా లభించడం వల్ల ఎముకల గట్టితనం కూడా పెరిగి, ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఆల్జీమర్స్ వ్యాధిని కూడా నియంత్రిస్తాయి.

6. అంతేకాదు పొట్టలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా ఈ పచ్చిబఠాణీలు సహాయపడతాయి.


7. బఠాణీలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన పచ్చిబఠాణీలను , ప్రతిరోజూ ఆహారంలో ఒక భాగంగా చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు వైద్యులు.


మరింత సమాచారం తెలుసుకోండి: