బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం వార్ 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమా రూ 400 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా కేవలం రూ.250 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఇందులో ఎన్టీఆర్ నటనపరంగా అభిమానులను మెప్పించారు.


దీంతో ఎన్టీఆర్ మొదటిసారిగా నటించిన బాలీవుడ్ సినిమాకి పెద్ద దెబ్బ పడిందని చెప్పవచ్చు. ఈ విషయంలో అభిమానులు కూడా తీవ్ర డిసప్పాయింట్ తోనే ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా వార్ 2 సినిమా ఓటిటి విడుదల పైన తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ  నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అక్టోబర్ 9వ తేదీన ఈ సినిమా స్ట్రిమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.


ఈ విషయం పైన మాత్రం ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా స్పందించలేదు, కానీ  థియేట్రికల్, డిజిటల్ రూల్స్ ప్రకారం బాలీవుడ్లో సినిమాలు విడుదలైన 8 వారాలలో, టాలీవుడ్ సినిమాలు 4 వారాలలో ఓటీటిలో విడుదల చేసుకొనే సదుపాయం కలిగి ఉన్నది. దీని ప్రకారం చూస్తే వార్ 2 సినిమా త్వరలోనే ఓటీటిలో విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి థియేటర్లో డిస్సప్పాయింట్ చేసిన ఈ సినిమా మరి ఓటిటిలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో పాటుగా దేవర 2 చిత్రంలో పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ సినిమాలను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: