కలకత్తాలోని ఒక సంపన్నమైన కుటుంబంలో జనవరి 12, 1863 న ఆయన జన్మించారు. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్ర నాథ్ దత్త. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరహంస ప్రియ శిష్యుడు. విదేశాలలో హిందు మతతత్వ బోధనలు చేసిన మొదటి భారతీయుడు స్వామి వివేకానంద. 

 

తన ఉపన్యాసాలతో ఆయన ఎంతో మందిని ప్రేరేపించారు. భారత దేశాభివృద్ధిని యువత సాధించాలని, తమ లక్షాలను చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సందేశం ఇచ్చేవారు. భారతదేశాన్ని అధునాతనంగా మార్చే శక్తి మన యువతలో ఉందని ముందే ఊహించి చెప్పిన వ్యక్తి వివేకానంద. 

 

అతని ప్రసంగం ఓ అద్భుతం.. ఈ మాట మనం చిన్నప్పటి నుండి విని ఉంటాం. పాఠ్య పుస్తకాలలో.. తల్లితండ్రుల మాటలలో.. ఇలా ఎక్కడ అంటే అక్కడ మనం అయన 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రారంభమైన సర్వమత మహాసభలో వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు, దాదాపు 7వేల మంది శ్రోతలు ఉన్నసభలో స్వామి వివేకానంద ఇచ్చిన ప్రసంగం ఇప్పటికి ఓ అద్భుతమే. ఆ ప్రసంగం మీరు ఒకసారి చదవండి.. 

 

అమెరికా సోదర సోదరీమణులారా...

 

నామతం గొప్పదంటే.. కాదు కాదు నామతం గొప్పది అంటూ కొట్లాడుకుంటున్న కాలంలో కాషాయం కట్టిన ఓ సాధారణ సన్యాసిగా చికాగోలోని సర్వమత సమ్మేళనంలోకి అడుగుపెట్టి ఓ నా అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ఆత్మీయ సంబోధనతో ప్రపంచదేశాలకు భారతీయ సోదరభావాన్ని, ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. 

 

ఆయన ఆత్మీయ సంబోధన విని వేలాదిమంది లేచి రెండు నిమిషాలపాటు చప్పట్లతో ఆనందానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన అనర్గళంగా చేసిన విశ్వజనీన ప్రసంగానికి అమెరికాలో ఉన్నవారు మంత్రముగ్ధులయ్యారు. అంతవరకు ఎవరికీ తెలియని స్వామి వివేకానంద అసాధారణ ధార్మిక ప్రబోధకుడిగా కీర్తిగాంచారు. 

 

స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత.. 

 

పుట్టింది యూరప్‌లో అయినా.. ఆమె యావత్ జీవితం సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల కోసమే ధారపోశారు. స్వామి వివేకానంద శిష్యురాలిగా గురువు చూపిన బాటలో తరించారు. భారతీయుల మదిలో సోదరిగా సిస్టర్ నివేదిత నిలిచిపోయారు. అసలు ఆమె సిస్టర్ నివేదిత ఎలా అయ్యారు అంటే ?

 

1895లో స్వామి వివేకానంద ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా తొలిసారి ఆయనతో పరిచయం ఏర్పడింది. స్వామిజీ వాక్చాతుర్యానికి, భారతీయతకు ముగ్దురాలైన ఆమె.. స్వామి వివేకానంద మార్గదర్శనంలో వేదాంత ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అనంతరం 1898లో జూన్ 28న భారతదేశానికి వచ్చారు. 

 

అప్పుడే ఆమె పేరు అయినా మార్గరెట్ పేరును నివేదితగా వివేకానంద మార్చారు. 'సమాజసేవకు అంకితమవ్వడం' అనే అర్థం వచ్చేలా అయన ఆ పేరు పెట్టారు. భవిష్యత్తులో నివేదిత జీవనయానం సమాజసేవతో ముడిపడనుందన్న విషయాన్ని ఈ పేరు మార్పు ద్వారా వివేకానందుడు చెప్పకనేచెప్పారు. అలానే ఆమె జీవితం అంత కూడా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల గురించే చాటిచెప్పింది. 

 

ఎంతోమంది గుండెల్లో నిలిచినా స్వామి వివేకానంద తన నలభయ్యవ పుట్టిన రోజును చూడబోనని స్వామీజీ ముందుగానే సూచించారు. అలా సూచించినట్లుగానే 1902 జూలై 4వ తేదీన రాత్రి 9:10గంటలకు స్వామీజీ మహాసమాధి అయ్యారు. 1985లో భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: