మనం ఎక్కువగా బయటకు వెళ్తున్నప్పుడు మన వెంట కచ్చితంగా ఒక వాటర్ బాటిల్ ను తీసుకు వెళుతూ ఉంటాము.అవి కూడా ఎన్నో రకాలుగా డిజైన్ల తో కూడి ఉంటాయి.. ప్రస్తుతం మార్కెట్లో దొరికేటటువంటి వాటర్ బాటిల్ చాలా తేలికగా ఉంటాయి.. కొంతమంది అయితే ఫైబర్, స్టీల్, కాఫర్ వంటి బాటిళ్లను వాడుతూ ఉంటారు. ఇవన్నీ మన ఆరోగ్యానికి అనుకూలంగానే ఉంటాయి.. అయితే ప్లాస్టిక్ బాటిల్ ను అరికట్టడానికి ఇవి చాలా మేలు చేస్తాయి.. అలా మనం ప్రతిసారి ఉపయోగించుకునే బాటిల్స్ ను శుభ్రంగా ఉంచకపోతే చాలా అనారోగ్య సమస్యలు వెలువడతాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

బాటిల్స్ ఎక్కువగా నీటితోనే ఉండటం చేత.. అందులో పాచి, బ్యాక్టీరియా వంటివి పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుచేతనే వీటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా వాటిని శుభ్రం చేసుకునేందుకు.. ఎకో-ఫ్రెండ్లీ డిష్ సోప్ ఉపయోగించి బాటిల్స్ ను శుభ్రం చేసుకోవాలి.. ముఖ్యంగా వేడి నీళ్ళు పోసి శుభ్రం చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా మరణిస్తుందట.. అయితే క్వాలిటీ ఉండే బాటిళ్లను మాత్రమే ప్రతిరోజు ఉపయోగించాలి.. బాటిల్స్ కు  ముఖ్యంగా స్ట్రా,గ్యాస్కెట్‌ వంటివి ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసివేయండి. ఆ తర్వాత అందులో కాస్త వేడి నీళ్లు పోసి.. డిష్ సోప్ వేసి.. బాటిల్ అన్ని భాగాలను బాగా కడగాలి.

అలా శుభ్రం చేసేటప్పుడు ఏదైనా పాత బ్రష్ తీసుకుని బాటిళ్లను వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవడం మంచిది. ఇక అంతే కాకుండా బాటిల్ కడిగేటప్పుడు బయట భాగాన్ని కూడా నీట్ గా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా లోకల్ వాటర్ బాటిల్ లను తీసుకొని పదేపదే వాటిని ఉపయోగించరాదు. బాటిల్ ను కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీ ఇంట్లో వాటర్ బాటిల్ లు ఉంటే వాటిని వెంటనే శుభ్రం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: