కొన్ని కొన్ని ఇళ్ళకు వాస్తు దోషం ఉంటుంది అలాంటి వారు ఎదురు మొక్కలు నాటితే ఉపశమనం కలుగుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.. మొక్కలు పర్యావరణాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించేలా చేస్తాయి. ఇంటికి తూర్పు దిశలో మనం ఈ వెదురు మొక్కలను నాటితే శాంతి ,సంతోషం ,ఆర్థిక శ్రేయస్సు అన్నీ కలుగుతాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో మూడు ప్రదేశాలలో వెదురు మొక్కలు నాటడం చాలా మంచిదట. అయితే ఈ వెదురు మొక్క పై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.. మరీ పూర్తిగా ఎండలో ఉంచడం వల్ల కూడా మొక్క దెబ్బతింటుంది.. ఆర్థిక స్థితి పై కూడా ప్రభావం పడుతుంది . కాబట్టి ఉదయం పూట మాత్రమే వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.
ఈ మొక్క మంచి ఎయిర్ ప్యూరిఫైర్ లాగా కూడా పనిచేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా చక్కగా సహాయపడుతుంది.. ఈ మొక్కలు నాటు కొనేటప్పుడు రెండు లేదా మూడు అడుగుల వరకు ఎత్తు పెరిగే మొక్కలు నాటడం ఉత్తమం.. వాస్తు ప్రకారం ఇళ్ళలోనే కాకుండా ఆఫీసులలో కూడా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. ప్రతికూల శక్తిని తొలగించి కార్యాలయాల్లో అభివృద్ధికి తోడ్పడుతుంది.అంతే కాదు ఈ మొక్కలకు నీరు పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి కూడా బాగా బలపడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి